సిద్ది వినాయక జ్యూయలరీ షాప్ లో పని చేసే అక్తర్ అనే వ్యక్తి దోపిడీకి ప్లాన్ చేశాడని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. సికింద్రాబాద్ లోని సిద్ది వినాయక జ్యుయలరీ దుకాణంలో ఐటీ అధికారులమని చెప్పి రెండు కిలోల బంగారం దోచుకున్న నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. సీవీ ఆనంద్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. .. సిద్ది వినాయక జ్యుయలరీ షాపు లో పనిచేసే అక్తర్ అనే వ్యక్తి ఈ దుకాణంలో దోపీడీకి ప్లాన్ చేసినట్టుగా సీపీ వివరించారు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని ఖానాపూర్ కు చెందిన తన స్నేహితులకు ఈ దోపీడీ గురించి వివరించారన్నారు.
ఐటీ అధికారులుగా నటిస్తూ బంగారం దుకాణంలో దోపీడీ చేసేందుకు ప్లాన్ చేసినట్టుగా సీవీ వివరించారు. ఈ దోపీడీ సమయంలో నిందితులు రెండు సినిమాలు చూశారని సీపీ తెలిపారు హీరో అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ 26, సూర్య నటించిన గ్యాంగ్ సినిమా దోపీడీకి ప్లాన్ చేసిందని సీవీ ఆనంద్ వివరించారు. మొత్తం పది మంది ఈ దోపీడీకి పాల్పడినట్టుగా సీపీ తెలిపారు. అయితే మహారాష్ట్ర ఖానాపూర్ లో నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా సీపీ వెల్లడించారు. మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఆరుగురు నిందితులు గోవాలో తలదాచుకున్నారని సీపీ చెప్పారు. ఈ ఆరుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. నిందితుల నుండి ఇంకా కొంత బంగారం రికవరీ చేయాల్సి ఉందని సీపీ తెలిపారు. ఖానాపూర్ లో నలుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న మిగిలిన ఆరుగురు దుండగులు తప్పించుకు తిరుగుతున్నారని సీపీ చెప్పారు. నకిలీ ఐటీ అధికారుల పేరుతో జ్యయలరీ దుకాణంలో దోపీడీ గురించి ఫిర్యాదు రాగానే తమ టీమ్ లు రంగంలోకి దిగాయన్నారు.