Saturday, November 23, 2024

తెలంగాణ వచ్చాక 9మెడికల్ కాలేజీలు వచ్చాయి.. హరీశ్ రావు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా వచ్చాక 9మెడికల్ కాలేజీలు వచ్చాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏడేళ్లలో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఒక్క ఏడాదే 8మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో మెడికల్ కాలేజీల సంఖ్య 17కు చేరిందన్నారు. ఒక్కో మెడికల్ కాలేజీకి సీఎం కేసీఆర్ రూ.510కోట్లు కేటాయించారన్నారు. 8 మెడికల్ కాలేజీల్లో 1200 సీట్లు ప్రారంభం కాబోతున్నాయన్నారు. తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయన్నారు. భవిష్యత్ లో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కానుందన్నారు. తెలంగాణకు కేంద్రం మెడికల్ కాలేజీలు మంజూరు చేయట్లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement