తెలుగు చిత్ర నటుడు నాగ చైతన్య అక్కినేని, సుప్రసిద్ధ లగ్జరీ, లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ మెన్స్ వరల్డ్ ఇండియా సెప్టెంబర్ 2022 సంచిక ముఖచిత్రంగా కనిపించి, వివేకవంతమైన స్టైల్ స్టేట్మెంట్ను మెన్ ఆఫ్ ప్లాటినమ్ కలెక్షన్ ధరించి అందించారు. తెలుగు, తమిళ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల ద్వారా గుర్తింపు పొందారు నాగచైతన్య. ఆయన నటించిన చిత్రాల్లో మనం, ఏం మాయ చేశావె, 100శాతం లవ్ మొదలైనవి అత్యధిక ప్రజాదరణ పొందడంతో పాటుగా ఇటీవలనే బాలీవుడ్ చిత్రం లాల్ సింగ్ చద్దాలో సైతం నటించి ప్రశంసలనందుకున్నారు. పురుషుల ఫ్యాషన్, శైలి పై అధికారం కలిగినట్లు ఈ సంచికలో నాగచైతన్య అక్కినేని పలు చిత్రాల ద్వారా తనదైన శైలిని వెల్లడించే ప్రయత్నం చేశారు. ఆయన ఈ సీజన్లో పురుషుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ప్లాటినమ్ ఆభరణాలను ప్రదర్శించారు.
ఈ ఆభరణాలు సుప్రసిద్ధ ఆభరణాల రిటైల్ ఔట్లట్ల వద్ద లభ్యమవుతున్నాయి. ఆడంబరం, క్లాస్‌కు ప్రతిరూపంగా నిలిచిన ఈ నటుడు మెన్ ఆఫ్ ప్లాటినమ్ కలెక్షన్లో విభిన్నమైన ఆభరణాలను ధరించారు. వీటిలో బోల్డ్ రింగ్స్, డ్యూయల్ టోన్ రిస్ట్‌వేర్, స్వచ్ఛమైన, అతి అరుదైన ప్లాటినమ్‌లో తీర్చిదిద్దిన వైవిధ్యమైన నెక్‌వేర్ ఉంది. ఈ కలెక్షన్ వైవిధ్యతను మరింత స్పష్టంగా కనిపించే రీతిలో ఈ నటుడు సున్నితమైన ఫార్మల్ వేర్లో, టైలర్డ్ సెమీ ఫార్మల్స్, అలాగే ట్రెండీ క్యాజువల్ ఔట్‌ఫిట్స్‌ను ధరించారు.అత్యంత అరుదైన విలువలు, లక్షణాలు కలిగిన మగవారికి ఇది ఖచ్చితమైన సరిజోడుగా నిలుస్తుంది. మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా, వినూత్నంగా ఉండాలనుకునే వారి అభిరుచులను ఇవి తీరుస్తాయి. 95శాతం స్వచ్ఛతకు భరోసా అందిస్తూ ప్లాటినమ్ ఇప్పుడు ఆభరణాలలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన స్వచ్ఛతను అందిస్తుంది.