Wednesday, November 20, 2024

GHMC: వార్డు స్థాయి శానిటేషన్ పై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి… రోనాల్డ్ రోస్

హైదరాబాద్ : వార్డు స్థాయి శానిటేషన్ పై కార్యాచరణ ప్రణాళికను వారంలోగా సిద్ధం చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ జోనల్ పరిధిలో గురువారం ఎస్ఎన్డీపీ, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ పనులు పరిశీలన అనంతరం కమిషనర్ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో శానిటేషన్ అడిషనల్ కమిషనర్, జోనల్ కమిషనర్, డి సి లు, ఏ ఎం హెచ్ ఓ లతో శానిటేషన్ పై సమీక్షించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… వార్డు స్థాయి శానిటేషన్ ప్రణాళికలో ప్రాథమిక స్థాయి నుండి డంప్ యార్డు వరకు ఏ ఏ చర్యలు తీసుకోవాలో ఆ ప్రణాళికలో ఉండాలని, చెత్త సేకరణ కాకుండా భవన నిర్మాణ వ్యర్థాలు, స్వీపింగ్, లిఫ్టింగ్, ట్రాన్స్ పోర్ట్ వార్డు స్థాయి ప్రణాళికలో పొందుపర్చాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటికి తిరిగే స్వచ్ఛ ఆటో రోజు వారి సేకరణపై ఇతరత్ర విషయాలపై ప్రణాళిక రూపొందించారన్నారు. అంతకు ముందు కమిషనర్ ఎస్ ఎన్ డి పీ ద్వారా కరాచీ బేకరి వద్ద మినిస్టర్ రోడ్డులో నిర్మాణాలు పూర్తయిన బ్రిడ్జిలను పరిశీలించారు. అదేవిధంగా ధనియాల గుట్ట గ్రేవ్ యార్డ్, పాటిగడ్డ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్, బన్సీలాల్ పేట్ మెట్ల బావిని పరిశీలించారు. కమిషనర్ వెంట అడిషనల్ కమిషనర్ శానిటేషన్ ఉపేందర్ రెడ్డి, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ లు, ఏ ఎమ్ హెచ్ ఓ లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement