భారతదేశంలో సుప్రసిద్ధ, సాంకేతికాధారిత రిటైల్ కంపెనీ ఏస్ టర్టెల్ ప్రపంచంలో అతిపెద్ద, ఎక్కువ మంది అభిమానించే టాయ్ స్టోర్ ఆర్ యూ ను భారతదేశంలోని వినియోగదారుల కోసం భౌతిక రూపంలో తీసుకువచ్చినట్లు వెల్లడించింది. ఈ నూతన టాయ్స్ ఆర్ యూ రిటైల్ స్టోర్‌ను హైటెక్ సిటీ సమీపంలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ వద్ద ప్రారంభించారు. ఈ నూతన స్టోర్‌లో ప్రపంచశ్రేణి బ్రాండెడ్ బొమ్మలు అందించడంతో పాటుగా చిన్నారుల కోసం తమ మస్కట్ జెఫ్రీ ద జిరాఫీతో పలు అనుభవపూర్వక టచ్‌పాయింట్లను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈసందర్భంగా ఏస్ టర్టెల్ సీఈఓ నితిన్ చాబ్రా ఈ స్టోర్ ప్రారంభం గురించి మాట్లాడుతూ… అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన టాయ్స్ ఆర్ యూ అనుభవాలను హైదరాబాద్‌లో మొదటి స్టోర్ ప్రారంభించడం ద్వారా చిన్నారుల చెంతకు తీసుకురావడం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. అత్యున్నత ఉత్పత్తుల ద్వారా స్టోర్ లోపల మరుపురాని అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. దీంతో పాటుగా మహోన్నత వినియోగదారుల సేవా అనుభవాలనూ అందించనున్నామన్నారు. ప్రభుత్వ మద్దతుతో భారతదేశంలో బొమ్మల పరిశ్రమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. సంఘటిత రంగంలో పరిమిత సంఖ్యలో ప్లేయర్లు ఉండటం వల్ల అపూర్వమైన అవకాశాలుంటాయన్నారు. భౌతికంగా మరిన్ని స్టోర్‌లను ప్రారంభించడంతో పాటుగా అదే రోజు (సేమ్ డే), తరువాత రోజు (నెక్ట్స్ డే) డెలివరీలను అందిస్తూ టాయ్స ఆర్ యూ లను విస్తరించనున్నామన్నారు.