రాబరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు సీపీ మహేష్ చౌహాన్ వెల్లడించారు. వనస్థలిపురంలో చోరీలకు పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. మరో నిందితుడు పరారీ ఉన్నారని, వారి వద్ద నుంచి రూ.18.28 లక్షలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వెంకట్‌రెడ్డి దగ్గర లోన్ తీసుకుని తిరిగి చెల్లించాక.. దోచుకోవాలని నయీం ప్లాన్ చేశాడని తెలిపారు. నిందితులు వెంకట్‌రెడ్డి దగ్గర తీసుకున్న లోన్ తిరిగి ఇచ్చేశారని, డబ్బుతో వెంకట్‌రెడ్డి ఇంటికి వెళ్తుండగా ఉమర్, మరో వ్యక్తి.. వెంకట్‌రెడ్డిని ఢీకొట్టి రూ.50 లక్షలతో పారిపోయేందుకు యత్నించాడని చెప్పారు. రూ.50 లక్షలు తీసుకుని వెళ్తుండగా రూ.25 లక్షలు అక్కడే పడిపోయాయని, రూ.25 లక్షలతో నిందితులు పారిపోయారని మహేష్ చౌహాన్ వివరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement