గండిపేట : రంగారెడ్డి జిల్లా గండిపేట మండల, మణికొండ మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. డీఈ దివ్యజ్యోతి ఇంట్లో దొరికిన డబ్బు పై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు.
గత రెండు సంవత్సరాల కాలంలో జరిగిన అక్రమాలపై ఆరా తీస్తున్నారు. మణికొండ మున్సిపాలిటీలో పనిచేస్తున్న అధికారులపై వరుసగా ఫిర్యాదులు వస్తుండడంతో తనిఖీలు చేపడుతున్నారు. కోట్ల రూపాయలు దారి మళ్లించినట్లు ఆరోపణలున్నాయి.