Tuesday, November 26, 2024

Abbott : సంపూర్ణ ఆరోగ్యం కోసం న్యూట్రి-పుల్ సిస్టమ్‌తో కొత్త పీడియాష్యూర్‌ను ప్రారంభించిన అబాట్

హైదరాబాద్ : పిల్లలు ఎదగడానికి, వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి సరైన పోషకాహారం చాలా కీలకం అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న సుమారు 149 మిలియన్ల మంది పిల్లలు ఎదుగుదల లోపంతో ఉన్నారు. వీరిలో మూడో వంతు లేదా 40.6 మిలియన్ల మంది బాలలు భారతదేశంలో ఉన్నారు. అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ కంపెనీ అయిన అబాట్, పిల్లల ఎదుగుదల, అభివృద్ధికి తోడ్పడేందుకు న్యూట్రీ-పుల్ సిస్టమ్‌తో కూడిన కొత్త పీడియా ష్యూర్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది.

పీడియాట్రిక్ న్యూట్రిషన్ డాక్టర్ డాక్టర్ ఎలీన్ కాండే, పీహెచ్ డీ న్యూట్రిషన్, ఆర్డీ మాట్లాడుతూ… పిల్లల ఎదుగుదలకు ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ కీలకం, అయితే కొన్నిసార్లు కాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలలో 50శాతం వరకు మాత్రమే పిల్లవాడు తినే ఆహారం నుండి శోషించబడవచ్చన్నారు. కేసిన్ ఫాస్ఫోపెప్టైడ్ పాల ప్రోటీన్ల జలవిశ్లేషణ నుండి తీసుకోబడింది, ఇది ఈ ఖనిజాలను బాగా శోషించడానికి తోడ్పడుతుందన్నారు. ఈ ఖనిజాలు పిల్లల క్యాచ్-అప్ పెరుగుదలకు సహాయపడవచ్చన్నారు.

భారతదేశంలోని అబాట్స్ న్యూట్రిషన్ బిజినెస్ జనరల్ మేనేజర్ నీల్ జార్జ్ మాట్లాడుతూ… తాము సేవలు అందిస్తున్న ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగు పరచాలనే లక్ష్యంతో అబాట్ సైన్స్ ఆధారిత పోషకాహారంలో పరిశోధన, ఆవిష్కరణలకు మార్గదర్శకత్వం వహిస్తోందన్నారు. కొత్త పెడియాష్యూర్ పిల్లలు వారి అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి తాము సరైన పోషకాలను, సీపీపీ వంటి కొత్త పదార్థాలను పంపిణీ చేస్తున్నామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement