బాలాపూర్‌లోని పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో యువకుడు కిడ్నాప్, దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ నెల 12న ఉస్మానియా ఆస్పత్రికి వెళ్తున్నాని ఇంట్లో చెప్పిన వెళ్లిన ఫైజల్ కనిపించకుండా పోవడంతో.. తమ కొడుకు ఇంటికి తిరిగిరాకపోవడంతో 13న తల్లిదండ్రులు బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఉస్మాన్‌నగర్‌కు చెందిన షా ఫైజల్ హత్యకు గురి కాబడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం.. దుండగులతో కలిసి కిడ్నాప్ చేసి అతి దారుణంగా హతమార్చారు. బండరాయితో తలపై మోదీ హంతమొందించారు. ఈ హత్యకు గల కారణం తన స్నేహితుడు జాఫర్‌గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి గొడవలే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు, నిందితుడు కలిసి ఇద్దరూ ఒకే చోట జాబ్ చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement