Friday, January 10, 2025

వైకుంఠద్వార దర్శనం ఒక పవిత్ర దివ్యభోగం.!

ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్

హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : తిరుమల తిరుపతి దేవస్థానం వారి జూబ్లీహిల్స్ తిరుమల శ్రీవారి ఆలయం, ఫిలింనగర్ దైవసన్నిధానం ఆలయం, మణికొండ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం, తిరుమల తిరుపతి దేవస్థానం వారి హిమాయత్ నగర్ తిరుమల శ్రీవారి ఆలయం, మేడ్చల్ ప్రసన్న వెంకటేశ్వరస్వామి వారి దేవాలయంతో పాటు జంటనగరాల్లో అనేక వైష్ణవాలయాల్లో ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ఆరాధన పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనాలైన భక్తి మార్గాల రచనలు ఓం నమో నారాయణాయ, కృష్ణం.. విష్ణుం గ్రంథాలను వేలకొలది భక్తులు, వాలంటీర్లు పంచడంతో భక్తుల పారవశ్యాన్ని హద్దు లేకుండా పోయినట్లు ఆయా ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.

వైకుంఠ ఏకాదశి పర్వదిన పుణ్యవేళ మహా సౌందర్యాల మంగళమూర్తి శ్రీవేంకటేశ్వరుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం జన్మల పుణ్యాల పారవశ్యమని జూబ్లీహిల్స్ తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్న పురాణపండ శ్రీనివాస్ పేర్కొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా పురాణపండ మాట్లాడుతూ ఋగ్యజుస్సామ వేదాల్లో చెప్పబడిన విహితకర్మలను ఆచరించిన తపోధనులు పుణ్యలోకాల్లో అనుభవించే దివ్యభోగాలు ఈ వైకుంఠ ఏకాదశి పుణ్యవేళ ఒక్క శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణమాత్రంచే లభిస్తాయని వ్యాస భగవానుడు మహాభారతంలో ఆవిష్కరించిన అంశాన్ని గుర్తుచేశారు.

ఉదయం నుండి సాయంత్రం వరకు జూబ్లీహిల్స్ తిరుమల శ్రీవారి ఆలయానికి విచ్చేసిన ప్రముఖుల్లో సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ, ప్రముఖ సినీ దర్శకుడు వంశీ పైడిపల్లి, వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు ఉండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement