Monday, November 25, 2024

ప్రకృతి వర్సెస్‌ పోషణపై రెండ్రోజుల సదస్సు విజయవంతం..

జూబ్లీహిల్స్‌, (ప్రభన్యూస్‌) : మానవ జీవన ఆవశ్యకతపై ప్రధానంగా దృష్టి సారించి, ప్రకృతి వర్సెస్‌ పోషణ అనేది ముఖ్యంగా మనుషులపై ఆధారపడి ఉంటుందని మా ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ ఫౌండర్‌ సునీతా కుమార్‌ అన్నారు. వారి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌ లో నిర్వహించిన రెండు రోజుల సదస్సు విజయవంతంగా ముగిసిందని తెలిపారు. ఎం.ఐ.ఎస్‌.హెచ్‌ ఆడిటోరియంలో సెమినార్‌ నిర్వహించగా నేచర్‌ వర్సెస్‌ నర్చర్‌ (ప్రకృతి వర్సెస్‌ పోష) బిహేవియరల్‌ అండ్‌ స్పీచ్‌ ఎఫెక్ట్స్‌ ఇన్‌ డెవలప్‌ మెంట్‌ డిజార్డర్స్‌ అనే అంశంపై సదస్సు జరిగిందని తెలిపారు. అంతే కాకుండా మల్టీ డిసిప్లినరీ ప్రొఫెషనల్స్‌ ను సంపూర్ణంగా అవగాహన చేసుకోవడం కూడా ప్రకృతి వర్సెస్‌ పోషణలో కీలకమే అన్నారు.

జన్యు శాస్త్రం గర్భస్థ పిండ ఔషధ నిపుణులు, పోషకాహార నిపుణులు, మెటబాలిక్‌ స్పెషలిస్ట్‌, స్పీచ్‌ అండ్‌ లాంగ్వేజ్‌ పాథాలజిస్ట్‌, స్పెషల్‌ ఎడ్యుకేషనలిస్ట్‌, సైకోలిస్ట్‌ లను మల్టీ డిసిప్లినరీ ప్రొఫెషనల్స్‌ కు ఉదాహరణగా చెప్పుకోవచ్చని, ఇంతే కాకుండా మానవ సమగ్ర పునరావాసాన్ని అర్థం చేసుకునేందుకు ఈఎన్‌ టి విధానం దోహదపడుతుందని పేర్కొన్నారు.. ఈ సదస్సులో దేశ వ్యాప్తంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులు పాల్గొన్నారు. అనేక విలువైన విషయాలను తమ ప్రసంగాల ద్వారా తెలిపారు. 100 మందికి పైగా ప్రొఫెషనల్స్‌, విద్యార్థులు ,వారి తల్లిదండ్రులు సెమినార్‌ కు హాజరయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement