బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఓయూ ఇఫ్లూ యూనివర్సిటీలో చోటుచేసుకుంది. హర్యానాకి చెందిన అంజలి అనే విద్యార్థిని ఓయూ ఇఫ్లూ యూనివర్సిటీలో ఏంఏ ఇంగ్లీష్ కోర్స్ చేస్తుంది. రాత్రి తల్లితో ఫోన్ లో మాట్లాడింది. అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ.. ఫోన్లో మాట్లాడుతూనే హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్థిని ఆత్మహత్యకు కుటుంబ సమ్యసలే కారణమని ఓయూ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement