Tuesday, November 26, 2024

సీనియర్‌ సిటిజన్స్‌ సంరక్షణ, శిక్షణలో ఒక నమూనా మార్పు… డా. రీమా నాడిగ్‌

హైదరాబాద్‌ : సీనియర్‌ సిటిజన్స్‌ సంరక్షణ, శిక్షణలో ఒక నమూనా మార్పు అని -కై-ట్స్‌ సీనియర్‌ కేర్‌ సహ వ్యవస్థాపకులు అండ్‌ గ్రూప్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రీమా నాడిగ్‌ తెలిపారు. ఈసందర్భంగా మాట్లాడుతూ… సీనియర్‌ హెల్త్‌కేర్‌ రంగంలో భారతదేశం అద్భుతమైన పురోగతి దాని వైద్యపరమైన పురోగతి పరంగా మాత్రమే కాకుండా, వయస్సుతో పాటు- వచ్చే జ్ఞానం పట్ల మన సమాజం కలిగి ఉన్న ప్రగాఢమైన గౌరవానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఆసుపత్రి గోడలను దాటి వినూత్న సంరక్షణ పరిష్కారాలను భారతదేశం స్వీకరిస్తున్నందున, వయోధికులను గౌరవించాలనే సామూహిక నిబద్ధత కనిపిస్తుందన్నారు. భారతదేశం మునుపెన్నడూ లేని విధంగా జనాభా మార్పును ఎదుర్కొంటోందన్నారు. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం, 2050 నాటికి, భారతదేశంలో 60, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారి సంఖ్య 319 మిలియన్లకు చేరుతుందన్నారు. ఇది యునై-టె-డ్‌ స్టేట్స్‌ మొత్తం జనాభా కంటే అధికమన్నారు. ఈ గణాంకాలు వృద్ధుల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి బలమైన, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి అవసరాన్ని కూడా నొక్కి చెబుతున్నాయన్నారు.

భారతదేశంలోని హాస్పిటల్‌ వెలుపల సంరక్షణ మార్కెట్‌ దాదాపు యూఎస్డీ 30-35 బిలియన్‌ డాలర్లు (2022) గా ఉందన్నారు. ఈ మొత్తంలో యూఎస్డీ 20బీఎన్‌ వృద్ధుల సంరక్షణ సేవలను కలిగి ఉంటు-ందన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మెటర్నిటీ-, ఇన్‌ఫెర్టిలిటీ- ఎలా స్పెషలైజేషన్‌గా మారిందో అదే రీతిలో రాబోయే రోజుల్లో వృద్ధుల సంరక్షణ కూడా ఒక ప్రత్యేకతగా మారనుందన్నారు. సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న పిల్లల తల్లిదండ్రులు ఇప్పుడు పెద్దల సంరక్షణ సేవలను ఒక ఆశీర్వాదంగా భావిస్తున్నారిప్పుడు. సంపూర్ణమైన సేవలను ఈ తరహా సంస్థలు అందిస్తాయి కాబట్టి, ఇంట్లో ఇచ్చే సంరక్షణ కంటే వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు. దీనికి తోడు ఇటీ-వలి మహమ్మారి తీసుకువచ్చిన కష్టాలు కారణంగా వృద్ధుల కోసం ప్రత్యేక సంరక్షణ ఆవశ్యకతను గుర్తిస్తున్నారు. వృద్ధుల కోసం సమగ్రమైన, వ్యక్తిగతీకరించిన సంరక్షణ కోసం పెరుగుతున్న డిమాండ్‌తో, శిక్షణ పొందిన జెరియాట్రిషియన్లు వృద్ధుల జీవన నాణ్యతను మెరుగు పరచడంలో, ఆసుపత్రిలో చేరడాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు. జెరియాట్రిషియన్‌ అవసరం ఉన్నప్పటికీ, సాంప్రదాయ వైద్య విద్యలో మాత్రం ఇది ఇప్పటికీ ప్రాముఖ్యత లేని అంశం గానే వుందన్నారు.

ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ జెరోంటాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో దాదాపు 4.5శాతం వైద్య కళాశాలల్లో మాత్రమే ప్రత్యేక జేరియాట్రిక్స్‌ విభాగం ఉందన్నారు. వృద్ధుల ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలు, అవసరాలను పరిష్కరించడానికి ప్రత్యేక నైపుణ్యాలు అవసరమన్నారు. వృద్ధులు అత్యధిక నాణ్యమైన సంరక్షణకు అర్హులన్నారు. వృద్ధుల సంరక్షణలో ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ చాలా కీలకమన్నారు. చాలా మంది వృద్ధులు ప్రత్యేక శ్రద్ధ అవసరమయ్యే సంక్లిష్ట వైద్య పరిస్థితులతో బాధపడుతున్నారన్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ, మందులను నిర్వహించడం, సరైన వైద్య సహాయాన్ని అందించడానికి తగిన శిక్షణ కూడా ఈ సంరక్షకులకు అవసరం పడుతుందన్నారు. భారతదేశంలో నైపుణ్యం కలిగిన వృద్ధుల సంరక్షణ సిబ్బంది అవసరం కాదనలేనిదన్నారు. వృద్ధుల సంరక్షణ కోసం నైపుణ్యం కలిగిన సిబ్బందిని అభివృద్ధి చేయడానికి చురు-కై-న చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కలిసి కట్టు-గా, కరుణతో మాత్రమే మనం మన వయోధికుల గోల్డెన్‌ ఇయర్స్‌ ను గౌరవంగా జీవించేలా చూసుకోవచ్చన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement