లారీ కింద పడి ఒకరు మృతిచెందిన విషాధ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పండగ రోజు ఈ విషాద ఘటన జరిగింది. తను నడిపే లారీ క్రింద పడి దామోదర్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. లారీ సెల్ఫ్ మోటర్ పనిచేయకపోవడంతో దిగి చెక్ చేసే సమయంలో దామోదర్‌పై లారీ దూసుకుపోయింది. దీంతో అతడు అక్కడిక్కక్కడే మృతి చెందాడు. మృతుడి స్వస్థలం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం గోపాలపెళ్లి గ్రామం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement