విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసి, వారి ఆలోచనలకు కార్యరూపం ఇచ్చి వారిని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా, స్టార్ట్ అప్ సంస్థల నిర్వాహకులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో నెలకొల్పిన ఫౌండర్స్ లాబ్ సంస్థ తన మొదటి వార్షికోత్సవాన్ని టీ – హబ్ లో ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా మొదటి వార్హికోత్సవ నివేదికను ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది
ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. విద్యార్థులను ఇంజనీరింగ్ కాలేజీ దశ నుండే ఎంట్రప్రెన్యూర్ షిప్ మీద అవగాహన కల్పిస్తూ ఫౌండర్స్ లాబ్ సంస్థ వారిచేత స్టార్టప్ లను ప్రారంభించడం సంతోషంగా ఉంది అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం స్టార్టప్ లను ప్రోత్సహించడానికి టీ-హబ్ వంటి అనేక సంస్థలను ప్రారంభించిందని, సార్టప్ ల ఏర్పాటు తర్వాత వారు ఎదుర్కునే ఒడిడుకులను నివారించడానికి, సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడతాయని అన్నారు.
సార్టప్ రంగంలో సేవలు అందించడానికి మహిళల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వీ-హబ్ సంస్థలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా సంస్థ సీఈవో శకుంతల రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది మహిళలకు సేవలు అందించడం జరిగింది అన్నారు. ఈ క్రమంలో శకుంతల కాసరగడ్డ ఈ సంస్థను ప్రారంభించడం సంతోషంగా ఉంది అన్నారు. తన యొక్క అపార అనుభవం విద్యార్థులకు, యువకులకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎంతో మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులను యువ పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిదే క్రమంలో ఫౌండర్స్ లాబ్ సంస్థతో భాగస్వామ్యులై కలిసి పనిచేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలను ఈ సందర్భంగా జయేష్ రంజన్ ప్రశంసించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న EY కార్పొరేట్ సంస్థ తెలంగాణ పార్టనర్ జయేష్ సంఘ్వీ మాట్లాడుతూ.. ఫౌండర్స్ లాబ్ సంస్థ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్పొరేట్ రంగంలో టెక్నలాజి సహా వివిధ సంస్థలు ఎదుర్కుంటున్న అనేకా సవాళ్ళను ఇలాంటి సంస్థలతో కలిసి పంచుకోవడం ద్వారా పరిష్కారం కనుక్కునే అవకాశం ఉంది అన్నారు. ఫౌండర్స్ లాబ్ సంస్థ తో కలిస్ పనిచేయడానికి EY సంస్థ సూత్రప్రాయంగా అంగీకరించింది అని తెలిపారు. పూర్తి స్థాయిలో కలిసి పనిచేయడానికి అవసరమైన చర్యల దిశగా ఇరు సంస్థలు ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు.
టీ – హబ్ సీఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ విదార్థుల్లో ఎంట్రప్రెన్యూర్ పట్ల అవగాహన కల్పించి స్టార్ట్ అప్ ఎకో సిస్టం పట్ల విద్యార్థుల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్న ఫౌండర్స్ లాబ్ కార్యక్రమాలు అభినందనీయం అన్నారు. ఈ విషయంలో ఫౌండర్స్ లాబ్ సంస్థకు టీ – హబ్ నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. టీ – హబ్ సంస్థతో ఫౌండర్స్ లాబ్ అవగాహన ఒప్పందం ద్వారా విద్యార్థుల చేత నెలకొల్పిన స్టార్ట్ అప్ లకు అన్ని రకాలుగా మరింత సహాకారం అందుతుందని, వారి తమ మార్కెట్ పెంచుకోవడానికి మరియు సంస్థలను అభివృద్ధి పరుచుకోవడానికి ఈ ఒప్పందం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు.
సంస్థ సీఈవో కాసరగడ్డ శకుంతల మాట్లాడుతూ.. హద్రాబాద్ కేంద్రంగా గత సంవత్సరం కేటీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించిన ఈ సంస్థ ఇంజనీరింగ్ కాలేజీల భాగస్వామ్యం, వారు తమ పట్ల ఉంచిన విశ్వాసంతో అనతికాలంలోనే అపూర్వమైన పురోగతిని సాధించిందని, ఈ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలతో పనిచేస్తూ.. దాదాపు 20 వేలకు పైగా విద్యార్థులకు ఎంట్రప్రెన్యూర్షిప్ మీద అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
మూడు వేలకు పైగా విద్యార్థుల ఆలోచనలను తీర్చిదిద్ది.. వారి ద్వారా వివిధ రంగాలకు చెందిన సార్ట్ అప్ లను సమాజానికి పరిచయం చేసే క్రమంలో సంస్థ ముందుకు సాగుతున్నదన్నారు. 150 మంది విద్యార్థులకు చెందిన ఆలోచనలకు పూర్తిస్థాయిలో ప్రోటో టైప్ లను తయారు చేయడంలో సంస్థ విజయవంతం అయిందని తెలిపారు. అంతేకాకుండా 20కి పైగా స్టార్ అప్ లను విద్యార్థుల చేత అతిత్వరలోనే ప్రారంభించడానికి కావాల్సిన చట్టపరమైన ఏర్పాట్లను ఆయా ఇంజనీరింగ్ కాలేజల్ సహకారంతో ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు.
ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన విద్యార్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే స్థాయి నుండి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నదని, ఒక ఉన్నతమైన లక్ష్యంతో ప్రారంభించిన ఈ సంస్థను మొట్టమొదట ఆదరించి విద్యార్థులతో పనిచేసే అవకాశాన్ని కల్పించిన ACE కాలేజీ యాజమాన్యానికి మరియు కిట్స్ కాలేజీ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.
తమతో సంస్థ పట్ల విశ్వాసం ఉంచి, తమను ప్రోత్సహించి మరింత ముందుకు నడిపించిన ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు ఈ సందర్భంగా సంస్థ సీఈవో కాసరగడ్డ శకుంతల పేరుపేరునా కృతఙ్ఞతలు తెలియజేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మేనేజ్ మెంట్ మరియు వైద్య రంగాల విద్యార్థుల్లో రీసెర్చ్ మరియు ఇన్నోవేషన్ లను ప్రోత్సహించి సమాజ అవసరాలకు తగ్గట్లుగా వివిధ రంగాలను మమేకం చేస్తూ అవసరమైన స్టార్ట్ అప్ లను ఏర్పాటు చేసే విధంగా తాము ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులకు ఇన్నోవేషన్ పట్ల మరింత అవగాహన పెరగడానికి మెంటార్ షిప్ నెట్ వర్క్ పెంచుకుంటూ .. అనేక వర్క్ షాప్ లను నిర్వహిస్తున్నామని తెలిపారు.
చివరగా సంస్థ డైరెక్టర్ సత్యప్రసాద్ పెద్దపల్లి మాట్లాడుతూ సంస్థ ఈ రోజు సాధించిన ఈ ఘనత పూర్తిగా సంస్థను ఆదరించిన ఇంజనీరింగ్ కాలేజీ లకే చెందుతుందని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థుల అవసరాలకు తగ్గట్లుగా సంస్థ తమ నెట్ వర్క్ విస్తరించుకుంటూ ముందుకు వెళ్తుందని, ఇన్నోవేషన్ ఇకో సిస్టంలో ప్రపంచ సవాళ్ళను ఎప్పటికప్పుడు విద్యార్థుల ముందు ఉంచి వారిద్వారా ఆ సవాళ్ళను పరిష్కరించడానికి సంస్థ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రంలో వివిధ ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖ సార్ట్ అప్ నిర్వాహకులు, మెంటార్ లు మరియు వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.