Friday, November 22, 2024

HYD: సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనం.. లెజెండరీ వంటకాల స్వర్గధామం హైదరాబాద్‌

హైదరాబాద్‌ : స్థానిక ఆహారాన్ని ప్రయత్నించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన అగ్రగామి 100 నగరాల్లో హైదరాబాద్‌ నిలవటం పట్ల గోల్డ్‌ డ్రాప్‌ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రముఖ ఫుడ్‌ గైడ్‌, టేస్ట్‌ అట్లాస్‌ – ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లోని ఆహార అద్భుతాలను జాబితాను సిద్ధం చేస్తుంది. ఈ జాబితాలో ప్రాంతీయ వంటకాలు, సుసంపన్నమైన సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన వంటకాలుగా హైదరాబాద్‌ నిలిచింది. గోల్డ్‌ డ్రాప్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మితేష్‌ లోహియా మాట్లాడుతూ… గ్లోబల్‌ టాప్‌ 100లో హైదరాబాద్‌ ప్రాంతీయ వంటకాలను ప్రముఖంగా చూడటం ఆనందంగా ఉందని, ఈ కలినరీ ప్రయాణంలో భాగం కావటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గోల్డ్‌ డ్రాప్‌ వద్ద ఈ విజయాన్ని వేడుకగా జరుపుకుంటున్నామని తెలిపారు. నగరం దాని చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప, విభిన్న వంటకాలను కలిగి ఉందన్నారు. కొన్ని వంటకాలు ఇప్పటికీ కుటుబ వంటకాలకు దగ్గరగా ఉంటాయన్నారు. ఇది నిజమైన స్వాద్‌ జో జిందగీసే జూడ్‌ జాయే. గోల్డ్‌ డ్రాప్‌ దాని ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలతో ఆహారం ప్రామాణికమైన రుచిని నిర్వహిస్తుందన్నారు. భోజన ప్రియులకు హైదరాబాద్‌, వంటల స్వర్గధామమన్నారు. ప్రఖ్యాత బిర్యానీ నుండి స్ట్రీట్ర్‌ ఫుడ్‌, చాట్‌, కుల్ఫీ, పెసర దోసె వరకు, ప్రతి బైట్‌.లో రుచి, సంస్కృతి ఉంటుందన్నారు. హైదరాబాద్‌ను దాని ఆహారం ద్వారా వివరించడానికి, ఇక్కడ ఒక ఖచ్చితమైన గైడ్‌ ఉందన్నారు.


బిర్యానీ : హైదరాబాదీ బిర్యానీ కేవలం వంటకం కాదు. అది ఒక వ్యక్తీకరణ. సంవత్సరాలుగా, సువాసన గల బిర్యానీ – అది కచ్చి(ముడి), పక్కి(వండినది) అయినా, ప్రతి దానికీ ప్రత్యేక అభిమానులున్నారన్నారు. మాంసం, అన్నం కలిపి వండే దమ్‌ స్టైల్‌ దీనికి విలక్షణమైన రుచిని ఇస్తుందన్నారు.


హైదరాబాదీ చక్నా : మేకల భాగాలతో తయారు చేసిన ఈ మసాలా వంటకం, నాన్‌ తో వడ్డించడం ప్రాంతీయ ప్రత్యేకత అన్నారు. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, యాలకులు, జొన్నలు, పసుపు, ఉప్పు, ఎర్ర మిరపకాయ, నల్ల మిరియాలు, గరం మసాలా, తాజా కొత్తిమీర, బే ఆకులు, పచ్చి మిరపకాయలు వంటివి దీనికి అద్భుతమైన రుచిని అందిస్తుందన్నారు.

- Advertisement -


మిర్చికా సలాన్‌ : లేత పచ్చి మిరపకాయలు, చింత పండుతో వండిన కూడిన కూర. మరొక ఇష్టమైన సలాన్‌ బైంగన్‌ మిర్చి కా సలాన్‌.
హైదరాబాదీ హలీమ్‌ : రంజాన్‌ సందర్భంగా ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిన హలీమ్‌ను మాంసం, పప్పులు, గోధుమలతో తయారు చేస్తారు, రాత్రిపూట ఒకే కుండలో నెమ్మదిగా వండుతారు.
దోసెలు : దక్షిణ భారతదేశమంతటా, వివిధ రకాల దోసెలు ఉన్నాయి. హైదరాబాద్‌ దోసెలు తమ మూలాన్ని కొనసాగిస్తూనే తమదైన ప్రత్యేకత చూపుతున్నాయన్నారు. విభిన్నమైన చట్నీల శ్రేణి వీటితో పాటు అందుబాటులో ఉంటుందన్నారు. అల్పాహారంగా వీటిని తీసుకోవచ్చన్నారు.


కబాబ్స్‌ : నోరూరించే ఈ తయారీని మాంసం లేదా కూరగాయలు లేదా పనీర్‌తో తయారు చేస్తారన్నారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది షికంపురి కబాబ్‌ – హైదరాబాద్‌ లో ప్రత్యేక వంటకమన్నారు. మలిడా, ఖుబానీకా మీఠా వంటి తియ్యందనాలు సైతం ఇక్కడ ప్రసిద్ధి చెందాయన్నారు. హైదరాబాద్‌లోనే కరాచీ బేకరీ నుండి బిస్కెట్లు ఉద్భవించాయన్నారు. కొత్త రుచులు, సంస్కృతులను అన్వేషించడానికి ఇష్టపడే ఎవరైనా తప్పనిసరిగా సందర్శించవలసిన గమ్యస్థానంగా ఈ నగరం ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement