జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ కస్టమర్ రాత్రంతా బ్యాంకులోనే బందీ అయ్యాడు. తీరా స్పృహతప్పిన వృద్ధుడిని తెల్లవారాక గుర్తించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని యూనియన్ బ్యాంక్ నిర్లక్ష్యం కారణంగా బ్యాంక్ లాకర్ ఆపరేట్ చేయడానికి వచ్చిన 85సంవత్సరాల వృద్దుడు రాత్రంతా బ్యాంక్ లోనే గడపాల్సి వచ్చింది. తెల్లవారిన తర్వాత బ్యాంక్ సిబ్బంది వచ్చి చూసేసరికి వృద్దుడు స్పృహ తప్పి పడిపోయాడు. వృద్ధుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement