హైదరాబాద్ : వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన నగరంలోని అంబర్ పేటలో చోటుచేసుకుంది. నిజామాబాద్ కు చెందిన గంగాధర్ తన కుటుంబంతో హైదరాబాద్కు వలస వచ్చి అంబర్ పేటలో నివాసం ఉంటున్నారు. గంగాధర్ కారు సర్వీసింగ్ సెంటర్లో పని చేస్తున్నాడు. ఆదివారం కావడంతో తన ఇద్దరు పిల్లలను సర్వీసింగ్ సెంటర్కు తీసుకువెళ్లాడు. గంగాధర్ పనిలో నిమగ్నమవ్వగా నాలుగేళ్ల ప్రదీప్ వీధిలోకి వెళ్లాడు. దీంతో అక్కడున్న వీధి కుక్కలు బాలుడిని చుట్టుముట్టి దాడి చేశాయి. ఈదాడిలో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement