రెండు నెలలుగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న 14 సంవత్సరాల బాలుడు మాస్టర్ అనిల్ కుమార్ చివరకు తన పోరాటంలో విజయం సాధించి, సంతోషంతో చిరునవ్వు చిందించాడు. బెంగళూరులోని రామయ్య నారాయణ హార్ట్ సెంటర్ వద్ద గుండె మార్పిడి శస్త్రచికిత్స అతనికి జరిగింది. మాస్టర్ అనిల్ కుమార్‌కు తీవ్రమైన ఈఎఫ్ (ఎజెక్షన్ ఫ్రాక్షన్)తో ఎడమ వైపు జఠిరిక పనిచేయకపోవడంతో డైలేటెడ్ కార్డియోమయోపతి సమస్య అతనికి ఉత్పన్నమైంది. ఇది 20–25శాతంగా ఉంది. ఈ గుండె మార్పిడి శస్త్రచికిత్సను వైఎస్‌ఆర్ పథకం కింద విజయవంతంగా నిర్వహించారు. రామయ్య నారాయణ హార్ట్ సెంటర్ వద్ద విజయవంతంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న 42వ రోగి మాస్టర్ అనిల్ కుమార్. ఈ కేసు గురించి డాక్టర్ నాగమల్లేష్ యుఎం, హార్ట్ ఫెయిల్యూర్ కన్సల్టెంట్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ కార్డియాలజిస్ట్, రామయ్య నారాయణ హార్ట్ సెంటర్ మాట్లాడుతూ…. తీవ్రమైన ఎడమ జఠిరిక పనిచేయకపోవడంతో డైలేటెడ్ కార్డియో మయోపతి అనేది మరణాలకు అతి పెద్ద కారణంగా నిలుస్తుందన్నారు. ఈ తరహా స్థితికి గుండె మార్పిడి ఒక్కటే పరిష్కారమన్నారు. మరీ ముఖ్యంగా మాస్టర్ అనిల్ కుమార్ లాంటి రోగులకు అని ఆయన తెలిపారు. ఈ గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం కావడంతో పాటుగా ఈ రోగిని వార్డుకు తరలించారు. అక్కడ అతను చక్కగా కోలుకుంటున్నాడు. తమ సంతోషాన్ని మాస్టర్ అనిల్ కుమార్ తండ్రి వెల్లడిస్తూ… రామయ్య నారాయణ హార్ట్ సెంటర్ వద్ద డాక్టర్‌లను కలుసుకోనంత వరకూ తమకు ఆశ లేదన్నారు. ఈ టీమ్ తమ అబ్బాయిని బ్రతికించడం మాత్రమే కాదు… అతను తిరిగి ఆరోగ్యం పొందేందుకు సైతం సహాయపడ్డారని, వారికి తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement