హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటలలో రికార్డ్ స్థాయిలో కరోనా టెస్ట్ లు నిర్వహించారు.. రోజుకి 1.50 లక్షలు టెస్ట్ లు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న అధికారులు మంగళవారం నాడు 1,30,105 పరీక్షలు చేశారు.. వాటిలో 6542 కేసులు పాజిటివ్ గా తేలాయి.. సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత తెలంగాణ నమోదైన అత్యధిక కేసులు ఇవే.. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో 3,67,901 కేసులు నమోదయ్యాయి.. కాగా మంగళవారం నాడు 20 మంది కరోనాతో మరణించారు.. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1876కి చేరింది… గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి…నిన్న గ్రేటర్ లో 898 కేసులు నమోదు కాగా,, మేడ్చల్లో 570, రంగారెడ్డిలో 532, నిజామాబాద్లో 427, సంగారెడ్డిలో 320, నల్గొండలో 285, మహబూబ్నగర్లో 263, వరంగల్ అర్బన్ 244, జగిత్యాలలో 230, ఖమ్మం జిల్లాలో 246 మంది మహమ్మారి బారినపడ్డారు. తాజాగా 2,887 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. దీంతో ఇప్పటి వరకు 3,19,537 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 46,488 యాక్టివ్ కేసులున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు తెలంగాణలో తొలి డోస్ వ్యాక్సిన్ ను 28 లక్షల 68వేల 553 మంది తీసుకున్నారు.. అలాగే రెండో డోస్ వ్యాక్సిన్ ను 4లక్షలు 132 మంది వేయించుకున్నారు.. నిన్న ఒక్క రోజే ప్రభుత్వ, ప్రైవేటు హాస్పటల్స్ లో తొలి డోస్ వ్యాక్సిన్ ను ఒక లక్ష 16వేల 552 మందికి వేయగా, రెండో డోస్ వ్యాక్సిన్ ను 17436 మంది తీసుకున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement