Tuesday, November 26, 2024

కేంద్రం హిట్ లిస్ట్ లో 52 మంది తెలంగాణ మావోయిస్ట్ లు….

హైదరాబాద్‌, : కేంద్రం మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టుల హిట్‌లిస్ట్‌ విడుదల చేయగా, ఇందులో 52మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్టులే ఉన్నారు. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం తరెంలో మావోయిస్టుల భీకర దాడి నేపథ్యంలో మావోయిస్టుల యాక్షన్‌ ప్లాన్‌, వ్యూహాలపై విస్తృత చర్చ జరుగుతోంది. మావోలు వ్యూహం మార్చుకున్న అంశాన్ని, మూడంచెల వ్యూహాలతో ముందుకు సాగుతున్న అంశంపై ఆంధ్రప్రభలో పలు కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. కొరియర్‌ వ్యవస్థే ఎరగా.. ఛత్తీస్‌గడ్‌లో మావోల భీకరదాడి పోలీసువర్గాలను షాక్‌కు గురిచేసింది. లాక్‌డౌన్‌ సమయం.. మావోలు శక్తిని సమకూర్చుకోవడానికి, సరికొత్త ఎత్తుగడలు అవలంభించేందుకు ఉపయోగపడిందని, తరెంలో దాడి సందర్భంగా పోలీసుల దాడులకు మావోలు ఏమాత్రం వెరవెక పోవడం.. అత్యంత దృడంగా ఉండడం జవాన్లను విస్మయపరి చింది. మావోలపై రెండుదశాబ్దాలుగా దాడులు , ఎన్‌కౌంటర్లు జరుగుతున్నా.. ప్రభావం ఉండదనుకుని హోంశాఖ వర్గాలు భావిస్తున్న సమయంలో 400మందికి పైగా బలగం ఒకేచోట దుర్భేద్యంగా దాడికి తెగబడడం ఓ సంచలనం. ఛత్తీస్‌గడ్‌ దాడితో తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమ య్యారు. మావోయిస్టు బెటాలియన్‌ సభ్యుడు దీపక్‌ నేతృత్వం లోని ఇటీవలే కొత్తగా యాక్షన్‌ టీం ఏర్పాటు కావడంతో సరిహద్దు ప్రాంతాల్లో దుశ్చర్యకు పాల్పడే అవకాశం ఉందని నిఘా విభాగం అనుమానిస్తోంది. వారు తరచుగా రాకపోకలు సాగించే ప్రాంతా లపై గట్టి నిఘా ఉంచడంతో పాటు సరిహద్దుల్లో కదలికల గురించి ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా గోదావరి నదిని దాటి తెలంగాణ లోకి రాకపోకలు సాగించేందుకు అనువైన తీర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుండడంతో పాటు రహదారుల్లో వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. గత ఆరేడుమాసాలుగా.. నక్సల్స్‌ కదలికలున్నా.. కట్టడిచేయడంలో తెలంగాణ పోలీసువర్గాలు సఫలమయ్యారు. ఇపుడు తాజా సంచలనం, యాక్షన్‌ టీంల రంగప్రవేశం నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించా లన్న సూచనలు అందుతున్నాయి.
తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీ ప్రస్తుతం చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా కేంద్రంగానే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. గతంలో తెలంగాణలోనే ప్రాంతాల వారీగా దళాలుండేవి. అక్కడికి సమీపంలోని అటవీ ప్రాంతా ల్లోనే మకాంవేసి కార్యకలాపాలు సాగించేవారు. నిర్బంధం పెరగడంతో చత్తీస్‌గఢ్‌ దండకారణ్యానికి తరలిన దళాలు.. అవసరాన్ని బట్టి నాటుపడవలు, ఫెర్రీల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బీజాపూర్‌ జిల్లాలో పట్టున్న కోమట్‌పల్లి, ధర్మారం, రాంపూర్‌, మల్లం పెంట, జబ్బగట్ట, మిన్‌గట్ట, సాక్లేర్‌, బట్టుం, గుండ్రాజుగు, తుమ్రెల్లు, పెద్దచందా, పామేడు, కిష్టారం తదితర ప్రాంతాల్లో తెలంగాణ కమిటీ నేతలు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. సరిహద్దులోని భద్రాచలం జిల్లా చర్చకు అవతల తాలిపేరు నది మొదలుకొని బీజాపూర్‌లోని చింతవాగు మధ్యలో వీరు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో స్థానికంగా పట్టు కలిగి ఉండడంతో రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారా యణ అలియాస్‌ హరిభూషణ్‌, తెలంగాణ పార్టీకి మార్గదర్శ కత్వం వహించే పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న మొదలుకొని రాష్ట్ర కమిటీ సభ్యులు కంకణాల రాజిరెడ్డి, మైలారపు అడెల్లు, కొయ్యడ సాంబయ్య తదితర అగ్రనేతలంతా అక్కడే ఉంటున్నట్లు గుర్తించారు. తాలిపేరు వాగు దాటి చర్ల ప్రాంతంలోకి, డోలిగుట్టల మీదుగా ఏటూరునాగారం ప్రాంతం లోకి రాకపోకలు సాగిస్తున్నట్లు సమాచారం సేకరించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సూచిస్తున్నాయి. విప్లవాలకు పుట్టిల్లు లాంటి తెలంగాణలో ఉనికి చాటేందుకు, సంచలనాలకు పాల్పడేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. అధికారపార్టీ ప్రజాప్రతిని ధులు, గతంలో హెచ్చరికలు అందుకున్న నాయకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఇప్పటికే సూచిస్తున్నారు.
అబూజ్‌మడ్‌లో కేంద్రకమిటీ
దుర్భేద్యమైన అడవులున్న అబూజ్‌మడ్‌లో కేంద్రకమిటీ మకాం వేసినట్లు నిఘా వర్గాల వద్ద సమాచారముంది. సుమారు 4వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ కొండల్లో అత్యధికం దట్టమైన అటవీ ప్రాంతమే. చత్తీస్‌గఢ్‌లోని నారాయ ణపూర్‌, బీజాపూర్‌, దంతేవాడ జిల్లాలతో కూడిన ఈ దండకార ణ్యం ఇప్పటికీ మావోయిస్టుల ఆధిపత్యంలోనే ఉండడం గమనార్హం. పొలిట్‌బ్యూరో సభ్యుడు గణపతి, కార్యదర్శి నంబాల కేశవరావు సహా అగ్రనేతలంతా అక్కడే తల దాచుకున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.
నయాప్లాన్‌
దండకారణ్యంలో తిరుగులేని పట్టు సాధించినా మావోయిస్టులు శాంతి చర్చల అంశం తెరపైకి తీసుకురావడం ఏంటన్నదే అంతుచిక్కకుండా తయారైంది. నెల రోజుల క్రితం శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిన మావోయిస్టులు తాజాగా విడుదల చేసిన ప్రకటన మరోసారి చర్చకు దారి తీసింది. ఏప్రిల్‌ 3న బీజాపూర్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌ ఘటన నుంచి ఓ జవాన్‌ను కిడ్నాప్‌ చేశారు. ఈ క్రమంలో అతను తమ ఆధీనంలో క్షేమంగానే ఉన్నాడని ప్రకటించారు. శాంతి చర్చల కోసం మధ్యవర్తులను ప్రకటించాలని డిమాండ్‌ చేయడం గమనార్హం. అసలు మావోయిస్టులు చర్చల గురించి ఎందుకు పట్టుబడుతున్నా రోనన్నదే హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement