సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్తున్న ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త అందించింది. సంక్రాంతి స్పెషల్‌గా 4 వేల ప్రత్యేక బస్సులను నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ఇవ్వాల (శుక్రవారం) ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నేతృత్వంలో టీఎస్‌ఆర్‌టీసీ అధికారులతో జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఈ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వర్తింపజేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.
ఈ 4 వేల 484 ప్రత్యేక బస్సుల్లో 626 బస్సులకు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. జనవరి 7 నుంచి 15 వరకు ఈ బస్సులు నడుస్తాయని.. బస్సు చార్జీలు పెంచబోమని.. సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయని సజ్జనార్ తెలిపారు.