మోండా,అక్టోబర్9(ప్రభన్యూస్): గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని లోటస్ గ్రాండ్ లాడ్జీలో పోలీసుల తనికీల్లో రూ.4లక్షల నగదు పట్టుబడింది. ఎన్నికల కమిషన్ షెడ్యుల్డ్ విడుదల చేయడంతో పోలీసులు నార్త్ జోన్ పరిధిలో విస్తృతంగా తనికీలు చేపట్టారు. కాగా రెజిమెంటల్ బజార్ ప్రాంతంలో ఉన్న లాడ్జిలలో గోపాలపురం డీఐ కౌశిక్, ఎస్సైలు దీక్షిత్ రెడ్డి, పరమేశ్వరి పోలీసులు సిబ్బంది కలిసి తనికీలు చేపట్టారు. ఈ సందర్భంగా లోటస్ గ్రాండ్ హోటల్లో తనికీలు చేయగా ఫార్మా కంపెనీలో డిజీఎంగా పనిచేసే ఓ వ్యక్తి నుంచి 4లక్షల నగదు స్వాధీనం చేసికున్నారు. దీనికి సంబంధించిన రశీదులు చూపిస్తే డబ్బును తిరిగి అప్పగిస్తామని ఇన్స్పెక్టర్ మురళీధర్ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement