హైదరాబాద్, : కరోనా వైరస్ సెకండ్‌వేవ్ రూపం లో ప్రజల ప్రాణాలను బలిగొంటూ రాష్ట్రంలో మారణహోం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 38 మంది ఒకేరోజు మృతి చెందారు. కరోనా కేసులు ప్రారంభమైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంబవించడం ఇదే తొలిసారి. అదేవిధంగా… రాష్ట్రంలో శనివారం ఒక్క రోజే 8126 పాజిటివ్ nకేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా టెస్టు కిట్ల కొరత రోజురోజుకు అధికమవుతోంది. దీంతో ప్రజలు టెస్టింగ్ కేంద్రాల వద్ద రోజంతా వేచిఉండి వెను దిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో కరోనా కట్ట డికి నైట్ కర్ఫ్యూ విధించినప్పటికీ అనేక జిల్లాల్లో కొవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ సోకితే చర్మ సంబంధిత వ్యాధులు కూడా ఇప్పుడు సెకండ్‌వేవ్‌లో వెలుగు చూసు ్తన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కరోనా కిట్ల కొరత
ఓ వైపు రోజువారీ కరోనా కేసులు ఆందోళనకరస్థాయిలో పెరుగుతుంటే… వైరస్ సోకింది లేనిదీ నిర్ధారించే కరోనా ర్యాపి డ్ యాంటిజెన్ కిట్ల తీవ్రత అధికమవుతోంది. ప్రతి జిల్లాలో కరోనా టెస్టింగ్ కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు నిండు కున్నాయి. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో కిట్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో జిల్లాల్లోని చాలా కేంద్రాల్లో కరోనా టెస్టులు నిలి చిపోతున్నాయి. టెస్టుల కోసం వచ్చిన ప్రజలను కిట్లు లేవని సిబ్బంది వెనక్కి పంపిస్తున్నారు. ఆర్ఏటీ కిట్లు కొరతగా ఉండడంతో ఎక్కువ టెస్టింగ్ కేంద్రాల్లో రోజుకు కేవలం 20 టెస్టులు చేసి మాత్రమే ఊరుకుంటున్నారు. దీంతో కరోనా టెస్టులు చేయించుకునేందుకు వందల మంది టెస్టింగ్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. అనుమతి లేకున్నా కరోనా నిర్ధారణా పరీక్షలు నిర్వహిస్తున్న ఆదిలాబాద్ జిల్లాలోని హర్ష స్కిన్ జనరల్ ప్రయివేటు ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. ఆస్పత్రిలో లభ్యమైన కిట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
జిల్లాల్లో పెరుగుతున్న కేసులు
నైట్ కర్ఫ్యూ పెట్టినప్పటికీ అనేక జిల్లాల్లో రోజువారీ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా రోజువారీ పాజిటివ్ కేసుల్లో మూడింట ఒక వంతు కేసులు హైదరాబాద్ నగరం నుంచే నమోదవుతున్నాయి. నగరంలో రోజువారీ పాజిటివ్ కేసులు నాలుగంకెలకు చేరుకున్నాయి. కేవలం ఏడు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో మూడెంకెల స్థాయిలోనే కేసులు నమోదవు తున్నా యి. ఎన్నికలు జరుగుతున్న ఖమ్మం, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఏ రోజుకారోజు రెట్టింపు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. . మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కొమరంభీం తదితర జిల్లాలతోపాటు సరిహద్దుతో సంబంధం లేదని యాదాద్రి భువనగిరి, జీహెచ్ఎంసీ పరిధిలోని మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, నిర్మల్, మెదక్ జిల్లాలు కరోనా హాట్స్పాట్లుగా మారుతున్నాయి. 24 గంటలలో నాలుగు వేలకు పైగా కేసులు ఈ జిల్లాలోనే నమోదు కావడం విశేషం..
రాష్ట్రంలో కరోనా మృత్యుకేళి
తెలంగాణలో కరోనా వైరస్ మృత్యుకేళి కొనసాగిస్తోంది. మొదటి దశలో కంటే 100 రెట్లు అధికంగా ప్రాణాలను బలిగొంటోంది. ఓ విధంగా చెప్పాలంటే కరోనా తెలంగాణలో మారణహోమాన్ని సృష్టిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారికంగా విడుదల చేస్తున్న కొవిడ్ మృతుల వివరాలను బట్టే ఏ రోజుకారోజు మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో హెల్త్ బులిటెన్ ప్రకారం అధికారికంగానే 38మంది మృత్యువా తపడ్డారు. వాస్తవ కరోనా మరణాలు ఇంతకంటే మూడు రెట్లు అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయప డుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్‌లో కొవిడ్ నోడ్ ఆస్పత్రులైన టిమ్స్, గాంధీలోనే రోజుకు 100 మంది దాకా చనిపోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. టిమ్స్‌లో ఆక్సిజన్ సరఫరాకు కొరత ఏర్పడడంతో సరిపోయినంత ఆక్సిజన్ అందకు ప్రతి గంటకు ఒకరికంటే ఎక్కువ మంది కొవిడ్ రోగులు మృత్యువాతపడుతున్నట్లు సమాచారం. గాంధీలోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది మార్చిలో కరోనా వైరస్ తెలంగాణలో వెలుగు చూసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒకేరోజు కరోనాతో 38 మంది మృతి చెందడం ఇదే ప్రథమం. కొవిడ్‌తో మృతి చెందిన వారి వివరాలను ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రు లతోపాటు బంధువులు కూడా గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.
చర్మ సంబంధిత అలర్జీ…
ప్రస్తుత కరోనా కాలంలో శరీరంలో కనిపించే ఏ కొత్త అనారోగ్య లక్షణానికైనా కరోనా వైరస్ కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలు వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి. మనిషి శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశించిన తర్వాత చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైరస్ దాడి చేసినపుడు లేదంటే వైరస్‌ను ఎదుర్కొనేందుకు తీసుకునే చికిత్సల కారణంగా శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుందోంటున్నారు. కొందరిలో దుద్దుర్లు, చర్మం ఎరుపు రంగుంలోకి మారిపోవడం, చర్మంపై అక్కడక్కడా ఎరుపు రంగు బొబ్బలు, రెండు మూడు గంటలపాటు దుద్దుర్లు, చేతి వేళ్ల రంగు మారడం, కంటిలోని తెల్ల గుడ్డు ఎర్రగా మారడం, చర్మంపై నీటి బుగ్గలు వస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు. కరోనా సోకిన చిన్నారుల్లో చర్మం మొత్తం ఎర్రగా మారడం, పెదవులు పగలడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్న కొందరిలో నెల, రెండు నెలల తర్వాత వెంట్రుకలు రాలిపోతున్నాయి.
హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా… నగదు చెల్లిస్తేనే వైద్యం
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రయివేటు ఆస్పత్రులు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ నగదు చెల్లిస్తేనే చికిత్స అంది స్తామని తెగేసి చెబుతున్నాయి. దీంతో కరోనా ఆపద కాలం లో హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు పనికిరాకుండా పోతోంది. కరోనా చికిత్సకు హెల్త్ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయడం లేదని బాధితులు వాపోతున్నారు. కార్పోరేటు, ప్రయివేటు ఆస్పత్రులు హెల్త్ కార్డులను పరిగణనలోనికి తీసుకోవడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇస్తేనే కరోనా చికిత్స ప్రారంభిస్తున్నారు. అప్పటిదాకా బెడ్ ఇవ్వడం లేదు. దీంతో కోవిడ్ పేషెంట్లు ప్రయివేటు ఆస్ప త్రుల ఎదుట అంబులెన్సుల్లో, ఆటోల్లో ప్రాణాలు వదిలేస్తు న్నారు. ప్రభు త్వం నిర్ణయించిన ధరలనే బీమా కంపెనీలు చెల్లిస్తుం డడంతో… ఆ మొత్తం కరోనా చికిత్సకు గిట్టుబాటు కావడం లేదని కార్పోరేటు ఆస్పత్రులు తెగేసి చెబుతు న్నాయి. వాస్తవా నికి కరోనా చికిత్సకు అయ్యేది కొంతే అయితే… పీపీఈ కిట్లు, డిస్పోజబుల్ గ్లౌస్లు వంటి వాటికి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. దీంతో కరోనా చికిత్స కు బిల్లు తడిసి మోపడ వుతోంది. ఈ నేపథ్యంలో అటు బీమా సంస్థలు, ఇటు కార్పో రేటు ఆస్పత్రులు చేతులె త్తేస్తుండడంతో నగదు చెల్లిస్తే పేషెంట్లకు బెడ్ దొరికే పరిస్థితులు నెలకొన్నాయి.
కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చండి
సెక్ండ్వేవ్లో వైరస్ రోజు రోజుకు ఉధృతమవుతండంతో కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న డిమాండ్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇదే డిమాండ్‌తో ఓ యువకుడు వినూత్న నిరసనకు దిగాడు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలండి… లేదా సీఎం కేసీఆర్‌ను గాంధీలో చేర్చండి అంటూ ప్లకార్డు పట్టుకుని గాంధీ ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపాడు.
కింగ్‌కోఠి ఆస్పత్రిలో యువతి వీరంగం
హైదరాబాద్ నగరలోని కింగ్‌కోఠి ఆస్పత్రిలో ఓ వృద్ధుడు మృతి చెందడంలో అతని మనుమరాలు ఆస్పత్రి అధికా రులతో గొడవకు దిగడమే కాకుండా ఏకంగా వెంటిలేటర్‌ను కూడా ధ్వంసం చేసింది. వెంటిలేటర్‌ను నెట్టి వేసి, పెద్దగా అరుస్తుండడంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు జర్నలిస్టులు కరోనాతో మృతి చెందారు. డిచ్పల్లి, దర్పల్లి రిపోర్టులు వేణుగోపాల్, శేఖర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.