హైదరాబాద్ : ఎలక్ర్టానిక్ తయారీ రంగంలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎలక్ర్టానిక్ తయారీ రంగానికి ప్రోత్సాహంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ, రాష్ర్టంలో 250కి పైబడిన కంపెనీల్లో ఎలక్ర్టానిక్స్ రంగంలో ఒక లక్షా 60 వేల మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు. ఎలక్ర్టానిక్స్ తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత రంగంగా పరిగణించిందన్నారు. విధాన రూపకల్పనలో భాగంగా పరిశ్రమల నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి ఒక ప్రత్యేక ఎలక్ర్టానిక్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తు చేశారు. క్లస్టర్ అభివృద్ధిలో భాగంగా ఓఆర్ఆర్ వెలుపల 912 ఎకరాల విస్తీర్ణంలో రెండు ఎలక్ర్టానిక్ క్లస్టర్ల తయారీని కలిగి ఉందని, వచ్చే నాలుగేళ్లలో రూ. 75 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ప్రణాళిలు రూపొందించామన్నారు. ఎలక్ర్టానిక్ తయారీ రంగం అభివృద్ధికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఎలక్ర్టానిక్ వాహనాల తయారీ రంగ పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గత 6 సంవత్సరాల్లో 23 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చుకున్నామని, తెలంగాణ ఏర్పడక ముందు ఈ రంగంలో 50 వేల ఉద్యోగాలు మాత్రమే ఉండేవని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement