Tuesday, September 17, 2024

HYD: 2024 మంగళ కలెక్షన్ విడుదల చేసిన టిబిజెడ్ -ది ఒరిజినల్

హైద‌రాబాద్ : ప్రముఖ నటి సంయుక్త మీనన్, హైదరాబాద్‌లోని పంజాగుట్ట వద్ద నున్న ప్రఖ్యాత టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్‌లో వరలక్ష్మీవ్రతం శుభ సందర్భంగా 2024 మంగళ కలెక్షన్ ని ఆవిష్కరించడంతో ఒక వైభవం ఆవిష్కృతమైంది. ఈ పండుగ సీజన్‌లో, దక్షిణ భారతదేశంలోని మహోన్నత సాంస్కృతిక వైభవానికి నివాళులర్పించే రీతిలో తీర్చిదిద్దబడిన ఈ కలక్షన్ లో వజ్రాలు, బంగారం ఒకదానితో ఒకటి పెనవేసుకుని పోయి ఉండటమే కాదు అద్భుతమైన పనితనపు ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తాయి.

ఈసంద‌ర్భంగా నటి సంయుక్త మీనన్ మాట్లాడుతూ… టిబిజెడ్ -ది ఒరిజినల్ చేస్తున్న ఈ విడుదల కార్యక్రమంలో భాగం కావటాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నానన్నారు. 2024 మంగళ కలెక్షన్ ని ఆవిష్కరించే ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని త‌న‌ను ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు.

- Advertisement -

భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వం నుండి ప్రేరణ పొందిన ఈ తరహా అందమైన ఆభరణాలను అలంకరించుకోవడం నిజంగా ఒక గౌరవమ‌న్నారు. ఈ కలెక్షన్ నుండి ప్రకాశవంతమైన సెట్‌లలో ఒకదాన్ని ధరించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానన్నారు. టిబిజెడ్ -ది ఒరిజినల్ నిజంగా మీకు సరైన ఎంపిక అండ్ సరైన ధర కలిగిన ఉత్పత్తులను అందిస్తుందన్నారు. త‌న అన్ని రకాల ఆభరణాల అవసరాల కోసం ఇది త‌న గమ్యస్థానమ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement