శంషాబాద్, ప్రభ న్యూస్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. గురువారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారుల తనిఖీలో 724 గ్రాముల బంగారం పట్టకుని స్వాధీనం చేసుకున్నారు. రెండవ కేసులో మరో ప్రయాణికుడు దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి వద్ద 214 గ్రాముల బంగారం, మూడవ కేసులో బైరాయిన్ నుంచి వచ్చిన ప్రయణికుడి వద్ద వీదేశి కరెన్సీని పట్టుకున్నారు.
నాలుగవ కేసులో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయణికుడి వద్ద 840 గ్రాముల బంగారం, ఐదవ కేసులో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద 736 గ్రాముల బంగారం, ఆరవ కేసులో షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 1220 గ్రాముల బంగారం. కస్టమ్స్‌ధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తం 3734 గ్రాముల బంగారం, విలువ దాదాపు రూ, 2 కోట్ల 19 లక్షలు ఉంటుందని అంచనా వేసి అధికారులు. 6 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అక్రమ విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు పట్టివేత
విదేశీ కరెన్సీని 16.46 లక్షల విలువ చేసే కరెన్సీని ఈ నెల 4,5 తేదీల్లో దుబాయ్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వస్తున్న ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయగా పెద్ద మొత్తం సోమ్ము స్వాధీనం చేసుకున్న అధికారులు. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేపట్టారు.