Friday, November 22, 2024

Followup: బ్యాంకు ఖాతాలో అకస్మాత్తుగా 18.52 కోట్ల.. అవాక్కయిన ఖాతాదారుడు..

వికారాబాద్‌, ప్రభన్యూస్‌ : వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో ఓ మొబైల్‌ షాపు నిర్వహించే ఖాతాదారుని ఖాతాలో అకస్మాత్తుగా 18 కోట్ల 52 లక్షల రూపాయలు జమ కావటంతో సంబందిత ఖాతాదారుడు అవాక్కు కాగా తనకు సంబందించిన 2 లక్షల రూపాయలను సహితం విత్‌డ్రా చేసుకునే వీలు లేకుండా పోయిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో మొబైల్‌ షాపు నిర్వహించే వెంకట్‌ రెడ్డి ఖాతాలోకి 18 కోట్ల 52 లక్షల రూపాయలు జమ కావటంతొ సంబందిత ఖాతాదారుడు బ్యాంకు వెల్లి వివరాలు తెలుసుకునే లోపు ఖాతా సీజ్‌ చేశారు. సంబందిత ఖాతాలోకి ఆదివారం రాత్రి ఈ డబ్బులు జమ కాగా ఖాతాదారుడు బ్యాంకు టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయగా, సోమవారం బ్యాంకుకు వెల్లి వివరాలు సమర్పించాల్సిందిగా సూచించినట్లు తెలిపారు.

బ్యాంకు లో తనకు తెలియకుండా జమ అయిన మొత్తం వివరాలను పక్కన పెడితే తాను అవసరం కోసం డ్రా చేద్దామనుకున్న 2 లక్షల రూపాయలు సహితం రాకుండా చేయటం ఎంత వరకు సమంజసమని వెంకట్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయమై సంబందిత హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంకు అధికారులను విలేఖరులు ప్రశ్నించగా సాంకేతిక పరమైన సమస్యల కారణంగా ఇతరుల అకౌంట్‌లో జమ కావాల్సిన మొత్తం తప్పుగా పడి ఉండవచ్చని ఈ విషయంలో బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. సంబంధిత బ్యాంకు ఖాతాదారునికి సంబందించిన 2 లక్షల రూపాయలకు సంబందించిన మొత్తం ఎటు వెల్లదని తప్పని సరిగా సంబందిత ఖాతాదారునికి న్యాయం జరుగుతుందని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement