హైదరాబాద్ : గత సంవత్సరం విజయవంతమైన తర్వాత, ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ దాని 15వ వార్షిక సదస్సు కోసం తిరిగి వచ్చింది. దక్షిణాసియాలో అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన డెవలపర్ కాన్ఫరెన్స్ నవంబర్ 2 నుండి 4 వరకు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ లో జరుగనుంది. దాదాపు 4,000 మందికి పైగా హాజరుకానున్న ఈ సదస్సులో , 150 మందికి పైగా స్పీకర్లు పాల్గొననున్నారు. 100 కంటే ఎక్కువ హైపర్యాక్టివ్ సెషన్లు ఉంటాయి. డెవలపర్లు, వినియోగదారులు తోడుగా, ప్రపంచంలో రెండవ అతిపెద్ద మార్కెట్‌గా భారతీయ గేమింగ్ పరిశ్రమ ఉద్భవించింది. 2028 నాటికి భారతీయ గేమింగ్ మార్కెట్ ఏటా 10 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా.
2022లో దేశంలోని గేమర్ల సంఖ్య 400 మిలియన్లను అధిగమించింది. అంతే కాకుండా గత సంవత్సరం కంటే 40 మిలియన్ల అధిక వృద్ధిని సాధించింది. అత్యధిక స్థాయిలో 600 మిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్ యూజర్-బేస్ దీనికి గణనీయమైన తోడ్పాటు అందిస్తుంది. ప్రపంచంలోనే అత్యధిక మొబైల్ డేటా వినియోగం భారత్‌లో ఉంది. ఇక్కడ ప్రతి వినియోగదారుకు సరాసరి నెలకు 20జీబీ చొప్పున డేటా వినియోగిస్తున్నారు. యాప్‌లో కొనుగోళ్లు కు యూపీఐ చెల్లింపులు, స్థానికీకరించిన కంటెంట్ ద్వారా వంటివి దీనికి కారణంగా నిలుస్తున్నాయి. ఆర్ట్ డైరెక్టర్లు, ప్రాజెక్ట్ హెడ్లు, స్టూడియో హెడ్లు, సీబీఓ ల ఆకట్టుకునే జాబితా అన్ని గేమింగ్ల గురించి మాట్లాడటానికి కూడా సిద్ధంగా ఉంది.