అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఫైర్ స్టేషన్లు, అగ్నిమాపక సిబ్బంది ఎంతగానో కృషి చేస్తారు. తెలంగాణలో కొత్తగా 15 ఫైర్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు అగ్నిమాపక కేంద్రాలు, ఉద్యోగాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఫైర్ స్టేషన్ల నిర్వహణకు అవసరమైన 382 ఉద్యోగాలను కూడా మంజూరుచేసింది. ఫైర్ స్టేషన్లు లేని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనుంది. కొత్తగా మంజూరైన ఉద్యోగాల్లో 367 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన, 15 పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకోనున్నారు. కొత్తగా మల్కాజిగిరి, ఎల్బీ నగర్, రాజేంద్రనగర్, షాద్నగర్, అంబర్పేట, చాంద్రాయణగుట్ట, జూబ్లీహిల్స్, స్టేషన్ ఘనపూర్, డోర్నకల్, నర్సాపూర్, హుస్నాబాద్, కల్వకుర్తి, బాల్కొండ, ధర్మపురి, పినపాక నియోజకవర్గాల్లో కొత్తగా అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement