టెస్ట్ ప్రిపరేటరీ సర్వీసెస్‌లో జాతీయ అగ్రగామిగా ఉన్న ఆకాష్ బైజూస్ ఈరోజు తమ అత్యంత ఆదరణ పొందిన, విస్తృతంగా కోరుకునే ANTHE (ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్) 2023 14వ ఎడిషన్‌ను అక్టోబర్ 7-15, 2023 మధ్య ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మక వార్షిక స్కాలర్‌షిప్ పరీక్ష IX-XII తరగతి విద్యార్థులు 100% వరకు స్కాలర్‌షిప్‌లు, విశేషమైన నగదు అవార్డులతో తమ సామర్థ్యాన్ని వెలికితీయడానికి అవకాశాన్ని అందిస్తుంది.
ఈసందర్భంగా ఆకాష్+ బైజూస్ డిప్యూటీ డైరెక్టర్ అమీత్ కుమార్ యు, రీజినల్ సేల్స్ అండ్ స్ట్రాటజిక్ హెడ్ భరత్ కుమార్ ఎం మాట్లాడుతూ… ANTHE స్కాలర్‌షిప్ గ్రహీతలు ఆకాష్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు. NEET, JEE, రాష్ట్ర CETలు, స్కూల్/బోర్డ్ పరీక్షలు, NTSE, ఒలింపియాడ్‌ల వంటి పోటీ స్కాలర్‌షిప్‌లతో సహా వివిధ పరీక్షలకు సిద్ధం కావడానికి నిపుణుల మార్గదర్శకత్వం, మెంటార్ షిప్ పొందవచ్చని వరంగల్ లో జరిగిన సమావేశంలో తెలిపారు. ఈ సంవత్సరం పరీక్షలో విద్యార్థులకు ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, వివిధ తరగతులకు చెందిన 100 మంది విద్యార్థులు 5-రోజుల అన్ని ఖర్చులతో కూడిన జాతీయ విజ్ఞాన యాత్రలో పాల్గొనే అవకాశం పొందవచ్చని వెల్లడించారు.
ANTHE 2023 గురించి ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL) CEO అభిషేక్ మహేశ్వరి మాట్లాడుతూ…. కలలు, సామర్థ్యాల మధ్య అంతరాన్ని తగ్గించడం ద్వారా లక్షలాది మంది విద్యార్థుల ఆకాంక్షలను నెరవేర్చడంలో ANTHE ఉత్ప్రేరకంగా ఉందన్నరు. విద్యార్థులు ఎక్కడున్నా వారి స్వంత వేగంతో NEET, IIT-JEE పరీక్షలకు సిద్ధం కావడానికి ANTHE తలుపులు తెరుస్తుందన్నారు.