Wednesday, November 20, 2024

రైతుల‌కు మ‌ద్ద‌తుగా 12న‌ భారీ ధ‌ర్నా : మంత్రి త‌ల‌సాని

హైద‌రాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద టిఆర్ఎస్ పార్టీ ఈ నెల 12న చేప‌ట్టే ధర్నాకు ఏర్పాట్లను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ శ్రీలత పరిశీలించారు. ఈసంద‌ర్భంగా త‌ల‌సాని మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధర్నా చేస్తున్నారని… వారికి మద్దతుగా టీఆర్ఎస్ హైదరాబాద్ లో ఈనెల 12న భారీ ధర్నా నిర్వ‌హిస్తోంద‌న్నారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది..దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు. కేంద్రం తెలంగాణను ప్రోత్సహించకుండా… ఇబ్బంది పెడుతుందన్నారు. కేంద్రం వ్యవసాయం రంగంలో నల్ల చట్టాలని తెచ్చిందన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు నిరంతర పోరాటం చేస్తామ‌న్నారు. రాష్ట్రాల నడ్డి కేంద్రం విరుస్తుందన్నారు. బిజేపీ రాష్ట్ర నేతలు డ్రామాలు చేస్తున్నారన్నారు. దేశంలోని అన్ని ప్రతిపక్షాలను ఏకం చేసి ఢిల్లీలో ధర్నా చేస్తామ‌న్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎలా జరుగుతాయో చూస్తామ‌న్నారు. తెలంగాణ బీజేపీ నేతలని పిలిచి చెప్పాలని కేంద్ర బీజేపీ నేతలను కోరుతున్నామ‌న్నారు.

హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ… ఈ నేల 12వ తేదిన జరిగే రైతు మద్దతు ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం అభివృద్ధి పథంలో పయనిస్తుంటే… కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాల ద్వారా రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున… ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడంతో వరి సాగు పెరిగిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement