వ్యాక్సిన్ తయారయ్యే ఆగ్రో సీడ్ ఆయిల్ సప్లయ్ చేస్తామని నమ్మించిన భారీ మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. ఆయిల్ పేరుతో ఓ వైద్యుడి నుంచి రూ.11 కోట్లు కాజేశారు. ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి గీత నారాయణ్ పేరుతో పరిచయం చేసుకున్నారు. అమెరికాలో ఖరీదైన ఆయిల్ బిజినెస్ చేస్తున్నామని నమ్మించారు. కరోనా రాకుండా అమెరికా, బ్రిటన్‌లలో.. టీకా కార్యక్రమం కొనసాగుతోందని వైద్యుడితో పరిచయం పెంచుకున్నారు. వ్యాక్సిన్ తయారయ్యే ఆగ్రో సీడ్ ఆయిల్ సప్లయ్ చేస్తామని చెప్పారు. విడతల వారిగా అమెరికన్ డాలర్స్ రూపంలో రూ.11 కోట్లు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు సైబర్ నేరగాళ్లు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు డాక్టర్ మురళీమోహన్ రావు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement