మల్కాజ్‌గిరి : జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధానంలో నేటి నుంచి అఖండ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మేడ్చల్‌లోని హనుమాన్ దీక్షా పీఠాన్ని సందర్శించారు. మహారాజ్ దుర్గా ప్రసాద్ స్వామిజీ వారి ఆశీస్సులను కవిత తీసుకున్నారు. హనుమాన్ దీక్షా పీఠాన్ని సందర్శించిన సందర్బంగా కవితకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె కొండగట్టుకి బయలుదేరివెళ్లారు.. ఇక్కడ కొండగట్టు అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో నేడి నుంచి రెండు మండలాల కాలం పాటు రోజూ సాయంత్రం 5 నుంచి 6 వరకు పఠిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తదితరులు పాల్గొననున్నారు.. దీనిలో భాగంగా ఐదు కోట్ల శ్రీరామకోటి ప్రతులను ఆలయ ప్రాంగణంలోని వై జంక్షన్ నుంచి మేళతాళాలు, కరతాళ ధ్వనుల మధ్య శోభాయమానంగా స్వామివారి వద్దకు తీసుకురానున్నారు. అనంతరం వేదిక వద్ద ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి ఆంజనేయస్వామికి అభిషేకం చేస్తారు. తరువాత 11 సార్లు వేదపండితులు, అర్చకులు, హనుమాన్ దీక్షాపరులు, భక్తులు హనుమాన్ చాలీసా పారాయణ పఠనం చేయనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement