హైదరాబాద్: సరూర్‌నగర్ పరిధిలోని అలకనంద ఆస్పత్రి కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఎనిమిది మంది దళారులను పోలీసులు గుర్తించారు.
గత ఆరు నెలలుగా అలకనంద ఆస్పత్రిలో ఈ తతంగం నడుస్తున్నట్లు గుర్తించారు. బెంగళూరుకు చెందిన వైద్యుడు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వైద్యుడితోపాటు మరికొంత మంది ప్రమేయం ఉందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆస్పత్రి నిర్వాహకుడు సుమంత్‌తోపాటు మరికొందరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.