Tuesday, November 26, 2024

స్వంత రాష్ట్రానికి తెలంగాణ ఉద్యోగులు..

హైదరాబాద్ , : ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేరుతోంది. వారి కష్టాలు తొలగి పోనున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆమోదం లభించడంతో వారు త్వరలో స్వరాష్ట్రం తెలంగాణకు చేరను న్నారు. ప్రాం త ఉద్యోగులను తెలంగాణకు రప్పించే కసరత్తు వేగ వంతమైంది. ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌కు తెలం గాణ సీఎస్‌ సోమేష్‌కుమార్‌ లేఖ రాసి తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు పంపించాలని కోరారు. ఈ లేఖకు సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎస్‌ ఉద్యో గుల తిరిగి పంపించే అంశంపై చర్యలు తీసు కుంటున్న ట్లు వెల్లడించారు. తెలంగాణ సీఎస్‌ రాసిన లేఖపై ఏపీ సీఎస్‌ స్పందించి వెంటనే ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి ఫైల్‌ను పంపి ఆయన ఆమోదం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎస్‌ఆర్‌ డిపా ర్ట్‌మెంట్‌ హెడ్‌ ప్రేంచ ంద్రారెడ్డికి తెలంగాణ ఎస్‌ఆర్‌ డిపార్ట్మెంట్‌ హెడ్‌ రామకృష్ణారావు లేఖ రాశారు. ఆప్షన్‌కు వ్యతిరేకంగా కమల్‌నాథన్‌ కమిటీ ఏపీకి పంపిన 3వ తరగతి, 4వ తరగతి ఉద్యోగులను తెలం గాణకు వెనుకకు తీసుకో నున్నామని ఈ లేఖలో వెల్లడించారు. డ్రైవర్లు, రికార్డు అసిస్టెంట్లు, లిఫ్ట్‌ ఆప రేటర్లు, క్యాషియర్ల వంటి 3వ తరగతి ఉద్యోగులు, అడెండర్లు, వాచ్‌మెన్లు, జమేదార్‌, మెసెంజర్స్‌ వంటి 4వ తరగతి ఉద్యోగు లతో కలుపు కుని మొత్తం 698మందిని వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక సచివాల యంనుంచి 180 మంది హెచ్‌వోడిలకు చెందిన ఉద్యో గులు మిగిలి పోగా, ఏపీకి కేటాయించిన ఉద్యోగుల్లో కొందరు మృతి చెందారు. వాళ్ల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద నియామ కమైన ఉద్యో గులను కూడా తెలంగాణకు రప్పించనున్నారు.
ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి రప్పించే ప్రక్రియను స్వయంగా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టితో పర్యవేక్షించారు. ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు చెందిన లెక్కలతో కూ డిన ఫైల్‌ అందిన వెంటనే ఆయన సమస్య పరి ష్కారం సూచించారు. ఏపీలో పనిచేస్తూ తెలంగాణకు రావాల నుకుంటున్న ఉద్యోగుల జాబితా ప్రభుత్వానికి చేరిం ది. ఈ జాబితాలో అడెండర్లు 625 మంది, జూనియర్‌ అసిస్టెంట్లు 23మంది, సీనియర్‌ అసిస్టెంట్లు 62మంది, సూపరింటెండెంట్లు 31మంది, టెక్నికల్‌ ఆఫీసర్లు ఒకరు, స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ ఒకరు, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ 3, కంప్యూటర్‌ ఆపరేటర్లు 2, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఒక రిని తెలంగాణకు రప్పించ నున్నారు. ఉద్యోగ పంపి ణీలో నెలకొన్న అనేక సమ స్యలపై మొద టినుంచీ తెల ంగాణ సర్కార్‌ చొరవ చూపుతూ వచ్చి ంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement