హైదరాబాద్ : తెలంగా్ణ రాష్ర్ట ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మ అందరి ముందుగా అందరికీ నమస్కారం అని తెలుగులో చెప్పి తన ప్రసంగాన్ని కొనసాగించారు..
అన్ని వర్గాల ప్రజల పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని. పారిశ్రామికీకరణ ద్వారా ఉద్యోగ అవకాశాలు పెంచామన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో అనేక వినూత్న పథకాలు రూపొందించామని తెలిపారు. ఎన్నో ఇబ్బందుల నుంచి నిలదొక్కుకున్నామని చెప్పారు. ఆరున్నర ఏళ్ల మేధోమథనం ఫలితంగానే తెలంగాణ దూసుకెళ్తోందన్నారు. ఈ ఏడాదికి రాష్ర్ట తలసరి ఆదాయం రూ. 2 లక్షల 28 వేలకు పెరిగిందన్నారు. ఆర్థిక నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తున్నామని చెప్పారు.
కొవిడ్ వల్ల అనేక రాష్ర్టాలు ఇబ్బంది పడ్డా , ఇక్కడ వ్యూహాత్మకంగా అడుగులు వేశామన్నారు. కరోనాను సమర్థంగా ఎదుర్కొనేందుకు అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందన్నారు.
విద్యుత్ రంగంలో రాష్ర్టం అద్వితీయ విజయాలు సాధించిందని తెలిపారు. 24 గంటల పాటు విద్యుత్ అందించే తొలి రాష్ర్టంగా రికార్డు సాధించామన్నారు. జాతీయ సగటు కంటే రాష్ర్ట విద్యుత్ తలసరి వినియోగం ఎక్కువ అని చెప్పారు. విద్యుత్ రంగ సంస్కరణలపై కేంద్రం రాష్ర్టాన్ని ప్రశంసించిందన్నారు.
మిషన్ భగీరథ పథకం అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందంటూ. దశాబ్దాల తాగునీటి గోసను మిషన్ భగీరథ తీర్చిందన్నారు. తెలంగాణను ఫ్లోరైడ్ రహిత రాష్ర్టంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ ద్వారా పురాతన చెరువులను పునరుద్ధరించామన్నారు. ఈ పథకం ద్వారా సుమారు 30 వేల చెరువులను బాగు చేశామన్నారు. మేం చేపట్టిన అనేక చర్యల వల్ల భూగర్భ జలాలు పెరిగాయన్నారు. కరువు ప్రాంతాలకు సాగునీరు అందివ్వడంతో పాలమూరులో వలసలు ఆగిపోయాయని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పచ్చని పంటలు కళకళలాడుతున్నాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులతో బీడువారిన భూములకు సాగునీరు అందించామన్నారు. వ్యవసాయ రంగానికి రాష్ర్ట ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతను ఇచ్చింది. రైతుబీమా కింద చనిపోయిన రైతు కుటుంబానికి రూ. 5 లక్షల బీమా ఇస్తున్నామని తెలిపారు. రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ. 10 వేల చొప్పున ఇస్తున్నామని చెప్పారు. రుణాల కింద వ్యవసాయ పరికరాలను అందించి రైతులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. 2.10 కోట్ల ఎకరాలు సాగులో ఉన్నాయన్నారు. 2020-21 ఏడాదిలో 1.04 కోట్ల ఎకరాల్లో వరి ధాన్యాన్ని సాగు చేశారన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. ఆసరా పెన్షన్లు అందించి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 6 కిలోల చొప్పున అందిస్తున్నామని తెలిపారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ, గ్రామాల అభివృద్ధికి నిధులు ఆపకుండా విడుదల చేశామన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ, డంప్‌యార్డు, రైతువేదిక, స్మశానవాటిక, హరిత వనాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పట్టణ ప్రగతి ద్వారా మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తున్నామని గవర్నర్ తెలిపారు.
సంక్షేమంలో సాటి – అభివృద్ధిలో మేటి ‘తెలంగాణ’ – గవర్నర్
Advertisement
తాజా వార్తలు
Advertisement