హైదరాబాద్ : కేంద్ర తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో వేల సంఖ్యలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారని, రైతులు ఆందోళన చెందుతున్నారని భట్టి విక్రమార్క్ వ్యాఖ్యానించారు. ఆ చట్టాలు రద్దు చేయాలని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఎమ్మెల్యే భట్టి మాట్లాడుతూ డిమాండ్ చేశారు.. దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే స్పందిస్తూ, భట్టి విక్రమార్క ఉప సభాపతిగా కూడా పని చేశారు. సభా నిబంధనలు మన కంటే వారికే ఎక్కువ తెలుసు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై మనం చెప్పాల్సింది చెప్పాం. సభ నుంచి , బయటి నుంచి కూడా చెప్పాం. సభలో రాష్ర్టానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే మంచిది. మీ పార్టీ సభ్యులు పార్లమెంట్‌లో ఉన్నారు కాబట్టి కేంద్ర పరిధిలో వచ్చే విషయాలు అక్కడ మాట్లాడితే మంచిదని భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ చురకలంటించారు.అలాగే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఎమ్మెల్యే భట్టికి ఇచ్చిన సమయం మించిపోవడంతో స్పీకర్ పోచారం మరో సభ్యుడికి అవకాశం ఇచ్చారు. దీంతో భట్టి మాట్లాడుతూ తమకు తగిన సమయం కేటాయించకపోవడం సరికాదన్నారు. ఇప్పటికే చాలా సమయం భట్టి వాడుకున్నారని, మిగిలిన సభ్యులకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని భట్టికి సూచించారు…
Advertisement
తాజా వార్తలు
Advertisement