కుత్బుల్లాపూర్ : నిజాంపేట్ కార్పొరేషన్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని బిజెపి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు ఆకుల సతీష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు నాలుగు లక్షల జనాభా ఉందని, కార్పొరేషన్ పరిధిలోని బడుగు, బలహీన వర్గాల 6 కాలనీలలో దాదాపు లక్ష పైగా జనాభా నివాసం ఉంటున్నారన్నారు. హైదరాబాద్ చుట్టు ప్రక్కల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పెద్ద కార్పొరేషన్ అని చెప్పుకోవడానికి గాని చేసేది ఏమి లేదని, పేరు గొప్ప ఊరు దిబ్బ లాగా ఇంత పెద్ద కార్పొరేషన్ 100 కోట్ల బడ్జెట్ చెప్పుకునే మున్సిపల్ మేయర్, కమీషనర్ కనీసం కార్పొరేషన్ పరిధిలో శాశ్వత ప్రాతిపదికన కరోనా టెస్ట్ సెంటర్ లేకపోవడం, ఎన్నిసార్లు విన్నవించినా.. నిరసన తెలిపినా.. ధర్నాలు చేసినా కార్పొరేషన్ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న వ్యాక్సినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయకపోవడం బట్టి చూస్తే కార్పొరేషన్‌లో ప్రజల ఆరోగ్యంపై శ్రద్ద ఏపాటిదో తెలుస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న కార్పొరేషన్ ప్రజలకు ఉచితంగా అందించడానికి కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు, మేయర్, కమీషనర్, పట్టించుకోకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ భాద్యతగా స్వీకరించి జిల్లా వైద్యాధికారికి, కలెక్టర్‌కి ఆన్‌లైన్ ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేశామన్నారు. కరోనా వ్యాక్సిన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి , ప్రజల ప్రాణాలను కాపాడాలని మనవి చేశామన్నారు. ఈ విధంగా కార్పొరేషన్ ప్రజల ఆరోగ్యం పట్ల అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, మేయర్, కార్పొరేటర్లు, మున్సిపల్ కమీషనర్‌కి ఏ మాత్రం శ్రద్ద లేదని కానీ, పేరుకు మాత్రం మోడల్ కార్పొరేషన్ అని చెప్పకోవడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement