హైదరాబాద్ : గడిచిన ఆరున్నర సంవత్సరాలుగా విద్యారంగంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమైన మార్పులు తీసుకువచ్చిందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. 2014కు ముందు 248 గురుకుల పాఠశాలలు ఉంటే.. కొత్తగా 647 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. గురుకులాల్లో 4 లక్షల 32 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, ఒక్కో విద్యార్థి మీద లక్షా 20 వేలు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్లవి ఇన్‌స్టిట్యూట్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవీకి మద్దతుగా ఏర్పాటు చేసిన ప్రయివేటు కాలేజేస్ అండ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అండ్ స్టాఫ్ వేల్ఫేర్ అసోసియేషన్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుండటంతో నీట్, జేఈఈతో పాటు ఇతర ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు. కేవలం స్కూల్స్ మాత్రమే కాకుండా.. ఆపై తరగతుల విద్యార్థులకు కూడా స్కాలర్‌షిప్స్ అందిస్తున్నామని చెప్పారు. గత 6 సంవత్సరాల్లో రూ. 12 వేల 800 కోట్లు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించిందన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అంబేడ్కర్, జ్యోతిబాపులే, వివేకానంద ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పేరిట విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం చేసిందేమీ లేదు అని స్పష్టం చేశారు. నగగరంలోని . విభజన చట్టంలోని సంస్థలను కూడా తెలంగాణకు ఇవ్వలేదని అంటూ రాష్ర్ట ప్రభుత్వం పన్నుల రూపంలో కేంద్రానికి రూ. 2 లక్షల 72 వేల కోట్లు కడితే.. కేంద్రం మాత్రం రాష్ర్టానికి చ్చింది రూ. లక్షా 40 వేల కోట్లు మాత్రమే అని స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి,సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టిన టిఆర్ ఎస్ పార్టీని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆదరించాలని కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement