హైదరాబాద్ ఆగ్లోమరేషన్‌కు నిధులెన్ని..
పట్టణ ప్రగతికి ప్రాధాన్యత ఎంత..
సీఎస్‌ఎస్‌లకు తప్పేలాలేని కేటాయింపులు
పురపాలకశాఖకు
రూ.10వేల కోట్లపైనే నిధుల అవసరం
నేటి బడ్జెట్‌లో తేలనున్న నిధుల లెక్క
హైదరాబాద్, : ఏప్రిల్ 1తో ప్రారంభం అవనున్న ఆర్థిక సంవత్సరం(2021-22)నకు గాను రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో పురపాలక శాఖకు భారీగానే నిధులు కేటాయించే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రభుత్వం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖకు నిర్వహణ వ్యయం కింద రూ.1260 కోట్లు ప్రగతి పద్దులో రూ.11వేల కోట్లు కేటాయించారు. ప్రగతి పద్దులో తిరిగి రెవెన్యూ వ్యయ ంగా రూ.3473 కోట్లు పెట్టుబడి వ్యయంగా రూ.7547 కోట్లు కేటాయించారు. అయితే వీటిలో చాలా వరకు హైదరాబాద్ అగ్లోమరేషన్ ప్రాజెక్టుకు కేటాయించారు. ఒక్క ఈ ప్రాజెక్టుకే రూ.7వేల కోట్లు కేటాయించడం పట్ల అప్పట్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకునే ఈ కేటాయింపు అనే ప్రచారం జరిగింది. అయితే దీనిలో చాలా వరకు మొత్తాన్ని ప్రభుత్వం జంట నగరాల్లో మౌలిక సదుపాయల అభివృద్ధికి ఖర్చు చేసి నట్లు గణాంకాల ద్వారా వెల్లడవుతోంది. ఒక్క గ్రేటర్ హైదరా బాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)లోనే రోడ్లు, ఫ్లై ఓవర్లు, తదితరాల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఆర్‌డీఎల్‌ల వాటాకు రాష్ట్ర ప్రభుత్వ వాటాను జత చేసి నిధుల కేటాయింపు చేసింది. వీటిలో చాలా వరకు ప్రాజెక్టులు ఇప్ప టికే పూర్తికాగా మరికొన్ని ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రాజధాని హైదరా బాద్‌కు భారీగా నిధులు అవసరమవున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను పెంపొందించడంలో భాగంగా ప్రభుత్వం కూడా హైదరాబాద్ మౌలికసదుపాయాల కోసం భారీగా ఖర్చు చేయడానికి సుముఖంగా ఉండడంతో హైదరాబాద్ ఆగ్లోమరేషన్ ప్రాజెక్టు కు మళ్లిd భారీగా నిధులు దక్కడం ఖాయం అన్న వాదన విని పిస్తోంది. ఇవి కాకుండా కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంటు కింద రూ.890 కోట్లు కేటాయించడమే కాక వీటిలో ఇప్పటికే సింహభాగం నిధులను విడుదల చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులకు జత చేసి ప్రతి నెల పట్టణ ప్రగతిలో భాగంంగా ఒక్క జీహెచ్‌ఎంసీకి 75 కోట్లు, రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన మున్సిపాలిటీలన్నింటికి కలిపి రూ.70 కోట్లను ప్రతి నెల క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ నిధుల్లో 50 శాతం దాకా రాష్ట్ర ప్రభు త్వం నిధులున్నట్లు పురపాలక శాఖ పలు సందర్భాల్లో వెల్లడిం చింది. కాగా, పట్టణ ప్రగతి స్కీమ్‌నకు వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించి గురువారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లోనూ మళ్లిd పెద్దపీట వేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవి కాకుండా గతేడాది కొత్తగా ఏర్పడిన మున్సి పాలిటీలు, కార్పొరేషన్‌లకు సుమారు రూ.1120 కోట్ల దాకా నిధులు కేటాయించారు. అయితే వీటిలో ఆయా మున్సిపా లిటీలకు పెద్దగా నిధులు విడుదల కాలేదని తెలుస్తోంది. కోవిడ్ సంక్షోభం కారణంగా బడ్జెట్ అంచనాలకు తగ్గట్టు రెవెన్యూ వసూలు కాకపోవడంతో రాష్ట్రప్రభుత్వం చేసిన పలు వ్యయా లను కుదించడమే దీనికి కారణమని అధికారులు పేర్కొంటు న్నారు. ఇవన్నీ కాకుండా అమృత్, స్మార్ట్ సిటీ లాంటి కేంద్ర ప్రాయోజిత పథకాలకు(సీఎస్‌ఎస్) రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌ను బడ్జెట్‌లో పేర్కొన్న మొత్తానికంటే ఎక్కువగానే విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఉన్న వ్యయ కేటాయింపులు కుదించడం, వ్యయాలు పెంచడం లాంటివన్నీ త్వరలో ప్రవేశపెట్టనున్న సవరించిన బడ్జెట్ అంచానల్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొననున్నట్లు అధికారులు చెబుతున్నారు.
నీటి బిల్లులు, ఆస్తి పన్ను రాయితీలకు బడ్జెట్‌లో నిధులు…
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రటకించిన పురపాలికల్లో ఆస్తిపన్నులో 50 శాతం రాయితీ, హైదరాబాద్ నగరంలో ప్రతి ఇంటికి 20వేల లీటర్ల వరకు ఉచిత మంచినీటికి సంబంధించి వచ్చే బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.300 కోట్లపైనే నిధులు కేటాయించనుందని అధికారులు భావిస్తు న్నారు. దీంతో పురపాలికలకు సొంత వనరుల్లో పడిన కోత పూడ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీనికి తోడు హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు నీటి పంపింగ్‌కు కరెంటు బిల్లులు చెల్లించాల్సి ఉన్నందున బోర్డు కొత్తగా అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో లోటు భర్తీ చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. వెరసి వచ్చే బడ్జెట్‌లోనూ పురపాలక శాఖకు భారీగానే నిధుల కేటాయింపు ఉండనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.