Tuesday, November 26, 2024

మ‌హిళా శ‌క్తికి అభినంద‌నం – కెసిఆర్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అభివృద్దిలో మ‌హిళలది అత్యంత కీలక పాత్ర అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మ‌హిళా దినోత్సవం సందర్భంగా మ‌హి ళాలోకానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పురుషులతో మహిళలు నేడు అన్ని రంగాల్లో పోటీప డుతూ మ‌హిళగా తన ప్రతిభను చాటుకుం టున్న దన్నారు. జనాభాలో సగంగా వున్న మ‌హిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తా రని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వారిని అభివృద్ది పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదన్నారు.
మ‌హిళల భద్రత కోసం షీ టీమ్స్‌, వృద్ధ మ‌హిళలు, ఒంటరి మ‌హిళలు, వితంతువులకు పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, అంగన్‌ వాడీ, ఆశా వర్కర్లకు వేతనాల పెంపు సహా మ‌హిళా సాధికారత కేంద్రంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు . తెలంగాణ రాష్ట్రం మ‌హిళ సంక్షేమంలో దేశంలోనే ముందంజలో ఉందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.
స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌.
అంతర్జాతీయ మ‌హిళా దినోత్సవం సందర్భంగా సోమవారం న ాడు రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ మ‌హిళా ఉద్యోగులందరికీ సెలవు దినంగా ప్రకటించినట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ను మహిళా ఉద్యోగులకు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement