హైదరాబాద్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మంత్రి కెటిఆర్ చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిచిన తర్వాతే విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సీఎం కేసీఆర్ కుటుంబం అన్నారు. అదిలాబాద్ జిల్లా భైంసా అలర్లలో గాయపడి నగరంలోని కార్పొరేట్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు.. వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు.. అల్లర్ల జరిగిన తీరును బాధితులు కిషన్ రెడ్డికి వివరించారు.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడేళ్లుగా షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరవలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించుకునేందుకే బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కుటుంబపాలన పట్ల తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత ఉందని దాని నుంచి దృష్టి మళ్లించడం కోసం టీఆర్ఎస్ పార్టీ ఒక పథకం ప్రకారం కేంద్రంపై విమర్శలు చేస్తోందన్నారు. కేంద్రాన్ని విమర్శించేముందు రాష్ట్ర పరిధిలో ఉన్న అనేక అంశాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందని దానికి జవాబు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement