హైదరాబాద్, తాను బీజేపీకో, టీఆర్‌ఎస్‌కో బీ టీం కాదని, ఉండాల్సిన అవసరమూ లేదని’ కీలక వ్యాఖ్యలు చేశారు వైయస్ షర్మిల. లోటస్ పాండ్ లో ఖమ్మం జిల్లా ముఖ్యనేతల సమావేశంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా మధిర మండల మున్సి పాలిటి వైస్ ఛైర్మన్, టీఆర్‌ఎస్ నేత శీలం విద్యాలత ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేసి షర్మిలకు మద్ధతు తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల ఖమ్మం ముఖ్యనేతలతో మాట్లాడుతూ..ఖమ్మం జిల్లా నుంచే సమర శంఖం పూరిద్దామని నేతలకు తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీకి సంబంధించి నేతల్లో ఉన్న అనుమా నాలపై కూడా ఆమె స్పష్టతనిచ్చినట్టు తెలు స్తోంది. అంతేకాకుండా సమస్యల సాధన కోసమే తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు నేతలకు చెప్పగా, ఏప్రిల్ 9న నిర్వహించబోయే సభలో పార్టీ ఏర్పాటును ప్రకటిద్దామని నేతలకు తెలిపారు. షర్మిలతో సమావేశంలో పాల్గొన్న నేతలు రాబోయే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటిచేయాలని కోరగా, ఎన్నికల్లో పోటీ అంశంపై ఆమె చిరు నవ్వుతో సమాధాన మిచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఖమ్మం జిల్లా నేతలతో షర్మిల నిర్వహించిన సమావేశానికి ఖమ్మం మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గ్రామస్తులు కూడా హజరైయ్యారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement