హైదరాబాద్: నిజామాబాద్ రైతాంగం పసుపు బోర్డు కోరితే ఏకంగా స్పైసీ బోర్డునే తీసుకొచ్చామని, ఇంతకంటే ఏం కావాలని బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్ అన్నారు.. పసుపు బోర్డు ఏర్పాటును కేంద్రం తిరస్కరించడంపై టిఆర్ ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు స్పందించిన ఆయన పసుపు బోర్డు కంటే మెరుగైనది ఎక్స్‌టెన్షన్ బోర్డు అని.. ఈ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో స్పష్టం చేశారన్నారు. బోర్డు వల్ల ఇప్పటికే చాలా మంది రైతులు లాభం పొందుతున్నారని చెప్పారు. అలాగే పసుపు కోసం పరిశోధనాలయాన్ని కూడా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేయనున్నామని కేంద్రం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా కాంగ్రెస్‌కి రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కేంద్రంలో రాహుల్ గాంధీ అధ్యక్షులుగా ఉంటేనే తమ పార్టీకి మరింత లాభమని అన్నారు… టీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయంగా అవగాహనకు వస్తున్నాయని ఈరోజు పార్లమెంట్ సాక్షిగా తేలిపోయిందన్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్‌కి లొంగిపోయారని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement