Friday, November 22, 2024

పరిసరాల శుభ్రత అందరి బాధ్యత..

మోండా : పరిసరాల పరిశుభ్రతలో ప్రజా సహకారంతో ఎంతో కీలకమైనదని ఉప సభాపతి తీగుళ్ళ పద్మారావు అన్నారు. మంగళవారం సీతాఫల్‌ మండి మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ లో జీహెచ్‌ఎంసీ ద్వారా సమకూర్చిన ఏడు ఆటో వాహనాలను పారిశుధ్య విభాగానికి అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మస్తీలను, కాలనీలను. రోడ్లను, వీధులన్నింటినీ శుభ్రంగా వుంచడంలో పారిశుధ్య కార్మికులు శ్రమ వెలకట్టలేనిదన్నారు. 24గంటలపాటు మనకోసం శ్రమిస్తున్నా మనలోని కొందరు తమ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిసూ ఎక్కడ పడితే అక్కడ చెత్త పడవేస్తూ వారిపై పని ఒత్తిడి పెంచుతున్నారన్నారు. ఇది సరైనది కాదని, తమ ఇళ్ళలోని వ్యర్ధాలు చెత్తను తడి చెత్తగా పొడి చెత్తగా వేరు చేసి పారిశుద్ద్య సిబ్బందికి అందించాలన్నారు. తద్వారా పరిసరాల శుభ్రతపై తమ బాధ్యతను చాటాలన్నారు. పారిశుధ్య కార్మికులలో అధిక వాతం మంది మహిళలే పని చేస్తుంటారని, వారి ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను కూడా తామే చూసుకుంటామన్నారు. ఇందులో భాగంగా సిబ్బందికి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలను ఉచితంగా జరిపేందుకు ఉచిత శిభిరాన్ని సైతం ప్రారంభించామన్నారు. సికింద్రబాద్‌ నియోజకవర్గం స్వచ్చతకు, ఆరోగ్య సమాజ నిర్మాణానికి మారుపేరుగా తీర్చి దిద్దుతామన్నారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతశోభన్‌ రెడ్డి, కార్పోరేటర్‌లు, సామల హేమ, కంది శైలజ, రాసూరి సునిత, ప్రసన్న కుమారి, డిప్యూటీ కమీషనర్‌ మోహన్‌ రెడ్డి, నాయకులు రామేశ్వర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement