Friday, November 22, 2024

త‌మిళ‌నాడులో దిన‌క‌ర‌న్ పార్టీతో ఎంఐఎం పొత్తు….

హైదరాబాద్: తమిళనాడు శాస‌న‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో ఎంఐఎం దిగ‌నుంది.. ఈ రాష్ట్రంలోని మూడు అసెంబ్లీ స్థానాల‌కు త‌మ పార్టీ అభ్య‌ర్ధుల‌ను నిల‌బెడుతున్న‌ద‌ని ఆ పార్టీ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ వెల్ల‌డించారు.. అలాగే త‌మ పార్టీ దినకరన్ పార్టీ తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నామ‌ని చెప్పారు.. రాజేంద్రనగర్ సర్కిల్ శాస్త్రీపురంలోని ఆయ‌న‌ నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, . చెన్నైలో 12వ తేదీన వీఎంసీలో సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు ప్రజలకు దినకరన్ పార్టీ అంటే నమ్మకం ఉందన్నారు. డీఎంకేతో విభేదం ఉందా లేదా అనేది 12వ తేదీన జరిగే సభలో పూర్తి వివరాలు చెప్తామన్నారు. గతంలో నాలుగు నుంచి ఐదు స్థానాల‌లో బరిలో ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం మూడు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 25 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీకి అపూర్వ స్పదన ఉందన్నారు. దినకరన్‌తో చర్చల అనంతరం మూడు స్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. కాగా, భైంసా అల్ల‌ర్లు పై స్పందిస్తూ, బిజెపి నేత‌లు చిన్న పిల్ల‌ల్లా వ్య‌వ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు.. నిజ‌మాబాద్, అదిలాబాద్ ల‌లో కొన్ని సున్నిత‌మైన ప్రాంతాలున్నాయ‌ని, వాటిపై ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌మ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోరామ‌న్నారు.. త‌మ‌ది శాంతియుత పార్టీ అని, విధ్వంసాల‌కు, విద్వేషాల‌కు తాము దూరంగా ఉంటామ‌ని అస‌ద్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement