Friday, October 18, 2024

తొలి గంట‌లోనే ఓటు హక్కు వినియోగించుకున్న ప్ర‌ముఖులు..

హైదరాబాద్‌ : రంగారెడ్డి-హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌, వరంగల్‌-నల్గొండ-ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఆయా జిల్లాల్లోని ప్రముఖులు త‌మ త‌మ‌ ఓటుహక్కును వినియోగించుకున్నారు. టి ఆర్ ఎస్ అభ్య‌ర్ధి ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి త‌న ఓటు హక్కును వ‌రంగ‌ల్ జిల్లా ప‌రిధిలో ఉప‌యోగించుకున్నారు.. ఇక కోదండ‌రాం కాక‌తీయ వ‌ర్శిటీఈ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓల్డ్‌ మలక్‌పేటలోని అగ్రికల్చర్‌ కార్యాలయంలో హోంమంత్రి మహబూబ్‌అలీ, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని గర్ల్స్‌ కళాశాలలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి – సునీత దంపతులు, వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 97 నంబర్‌ పోలింగ్ బూత్‌లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్, మిర్యాలగూడ పట్టణంలోని బకల్‌వాడి పాఠశాలలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆయన కుమారుడు సిద్ధార్థతో కలిసి ఓటువేశారు. ములుగులోని 179 పోలింగ్‌ బూత్‌లో జిల్లా పరిషత్‌ అధ్యక్షుడు జగదీశ్వర్‌ ఓటు వేశారు. కోదాడలో ఎమ్మెల్యే మల్లయ్యాదవ్‌, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కలెక్టర్ అనితా రామచంద్రన్‌, మహబూబాబాద్‌ పట్టణం ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఎమ్మెల్యే భానోత్‌ శంకర్‌నాయక్‌ దంపతులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌ మాదాపూర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఎంపీ కెప్టెన్‌ వీ లక్ష్మీకాంత్‌రావు, బంజారాహిల్స్‌లోని నీటిపారుదలశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో నగర మేయర్‌ విజయలక్ష్మి, అలాగే షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయంలో మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, చర్లపల్లి డివిజన్‌ కార్పొరేటర్‌ బొంతు శ్రీదేవియాదవ్‌ దంపతులు ఓటు వేశారు. వ‌రంగ‌ల్ ప‌రిధిలో బిజెపి అభ్య‌ర్ధి ప్రేమేంద‌ర్ రెడ్డి, రాణి రుద్ర‌మ‌లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement