Friday, November 22, 2024

టి ఎస్ పిఎస్సీ ఖాళీ….

సర్వీస్‌ కమిషన్‌లో ఏకనిేరంజన్‌
నేడు పదవీ విరమణ చేయనున్న ఇంఛార్జ్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి
మిగిలేది మరో సభ్యుడే
కోరం కావాలంటే ఆరుగురు సభ్యులు తప్పనిసరి

హైద‌రాబాద్ : వందల ఉద్యో గాలను భర్తీ చేయాల్సిన తెలంగాణ రాష్ట్ర పబ్లిస్‌ సర్వీస్‌ కమి షన్‌ (టీఎస్‌ పీఎస్సీ) సభ్యుల లేమితో బోసిపోతోంది. సర్వీస్‌ కమిషన్‌లో ఒక చైర్మన్‌, పది మంది సభ్యులు పని చేయాల్సి ఉండగా ఇప్పుడు కేవలం ఇద్దరంటే ఇద్దరు సభ్యు లే మిగిలారు. చైర్మన్‌గా పని చేసి పదవీ విర మణ చేసిన ఆచార్య ఘంటా చక్రపాణి స్థానంలో ప్రభుత్వం సీనియర్‌ సభ్యుడైన కృష్ణారెడ్డిని నియమిం చింది. ఆయన పదవీకాలం గురువారంతో ముగుస్తుంది. ప్రస్తుతం మిగిలింది ఒకే ఒక సభ్యుడు. ఈ సభ్యుడు కూడా మరో ఐదు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. ప్రభుత్వం ఓవైపు 50వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు
ప్రణాళిక సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ టీఎస్‌ పీఎస్సీలో చైర్మన్‌, మిగిలిపోయిన సభ్యుల నియామకం విషయంలో దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వీస్‌ కమిషన్‌లో ఏ విధానపరమైన నిర్ణయం తీసుకోవాలన్న కనీసం ఆరు మంది సభ్యులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఒక సభ్యుడు, కార్యదర్శి మాత్రమే మిగిలారు. వీరు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండాపోయింది. సాధారణంగా సీనియర్‌ కమిషన్‌ సభ్యులను ఇంఛార్జి చైర్మన్‌గా నియమించే సాంప్రదాయం ఉంది. ఇది వరకు కమిషన్‌ సభ్యుడిగా పని చేసిన ఉద్యోగ సంఘం నేత, తెలంగాణ ఉద్యమకారుడు విఠల్‌కు ఈ అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదన సీఎం పరిశీలనలో ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. విఠల్‌తో పాటు పదవీ విరమణ చేసిన నిఘా విభాగం ఐజీ నవీన్‌చంద్‌ను ఈ పదవిలో ఎంపిక చేస్తున్నారని సీఎం కార్యాలయం సంకేతాలిచ్చింది. అమెరికాలో ఉన్న నవీన్‌చంద్‌ను హుటాహుటిన బయలుదేరి రావాలని కోరినట్టు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా మరో సభ్యుడైన కృష్ణారెడ్డికి ఇంఛార్జి చైర్మన్‌ బాధ్యతలను ప్రభుత్వం కట్టబెట్టింది. ఆయన కూడా నేడు పదవీ విరమణ చేస్తున్నారని మిగిలింది ఒక్కరేనని ఆయనతో కమిషన్‌ కార్యకలాపాలు ఎలా ముందుకు సాగుతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పది విశ్వవిద్యాలయాల ఉపకులపతులతోపాటు ఉన్నత విద్యామండలి చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు, టీఎస్‌ పీఎస్సీ చైర్మన్‌ సభ్యులను ఏకకాలంలో నియమించేందుకు సీఎం కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని దాదాపు 25 పదవులను భర్తీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. టీఎస్‌ పీఎస్సీ, ఉన్నత విద్యామండలి, ఉప కులపతులు, వీసీ కమిషన్‌ చైర్మన్‌ సభ్యులను నియమించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగానే ఈ పదవులన్నింటినీ భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెరాస ముఖ్య నేత ఒకరు చెప్పారు. అయితే ఈ పదవుల కోసం విద్యావేత్తలు, రాజకీయ నాయకులు పెద్దఎత్తున పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆశావహులు ఇప్పటికే తమకు సమీపంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతల ద్వారా సీఎం కేసీఆర్‌, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసి తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని కోరారు. అయితే ఉపకులపతుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్వేషణా కమిటీలను సమావేశపరిచింది. ఈ కమిటీ ఒక్కో విశ్వవిద్యాలయానికి ముగ్గురి పేర్లను సిఫారసు చేసి తుది ఆమోదం కోసం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపింది. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ రావడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడంతో ప్రభుత్వం ఇందుకు సంబంధించి దస్త్రాలను పక్కన పెట్టింది. తాజాగా నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌ రావడంతో ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని ఈ నియామకాలను పూర్తి చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది. శాసనసభ సమావేశాలు ముగిసేలోపే ఈ నియామకాలపై తుది నిర్ణయానికి రావాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement