Saturday, November 23, 2024

టిఆర్ ఎస్ ఖతర్ శాఖ 2021వార్షిక క్యాలెండర్

హైదరాబాద్ : గల్ఫ్ దేశాలలో జీత భత్యాలు తగ్గించడం చాలా బాధ కలిగించే విషయమని అన్నారు మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌. టీఆర్ఎస్ ఖతర్ శాఖ రూపొందించిన 2021 వార్షిక క్యాలెండ‌ర్‌ను హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌ ఆవిష్కరించారు. టీఆర్ఎస్ ఖతర్ శాఖ ఉపాధ్యక్షుడు నర్సయ్య, నాయకులు నరేష్, మారుతిలతో మంత్రి గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న తెలంగాణ బిడ్డల జీవన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, కువైట్, ఒమన్,ఖతర్, ఇరాన్ తదితర దేశాలలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన వేలాది మంది పనిచేస్తున్నారన్నారు. వీరిలో చాలామంది చిరుద్యోగులే. వీళ్ల జీతాలలో సగానికి పైగా తగ్గించాలంటూ ప్రధానమంత్రి మోడీ ఏకపక్షంగా నిర్ణయించి ఉత్తర్వులివ్వడం పట్ల మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చి ప్రధానికి వివరించాల్సిందిగా కోరుతానని మంత్రి హామీనిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement